Tirumala Tirupati:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఆగస్టు 5 నుంచి 7 వరకు శ్రీవారి ఆలయంలో ఈ సేవలు రద్దు..
Tirumala Tirupati:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఆగస్టు 5 నుంచి 7 వరకు శ్రీవారి ఆలయంలో ఈ సేవలు రద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం: ఆగస్టు 5 నుంచి 7 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 15-16 శతాబ్దాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని, 1962 నుంచి టీటీడీ వీటిని పునరుద్ధరించిందని తెలిపింది.
కార్యక్రమ వివరాలు:
ఆగస్టు 5-7: ఉదయం 9-11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపనతిరుమంజనం.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఆగస్టు 5: పవిత్రాల ప్రతిష్ట.
ఆగస్టు 6: పవిత్ర సమర్పణ.
ఆగస్టు 7: పూర్ణాహుతి.
సేవల రద్దు:
ఆగస్టు 4: సహస్రదీపాలంకార సేవ.
ఆగస్టు 5: అష్టదళ పాద పద్మారాధన సేవ.
ఆగస్టు 7: తిరుప్పావడ సేవ.
ఆగస్టు 5-7: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు.
భక్తులు ఈ వివరాలను గమనించి, తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

