Devotional

Tirumala Tirupati:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఆగ‌స్టు 5 నుంచి 7 వరకు శ్రీవారి ఆలయంలో ఈ సేవలు రద్దు..

Tirumala Tirupati:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఆగ‌స్టు 5 నుంచి 7 వరకు శ్రీవారి ఆలయంలో ఈ సేవలు రద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం: ఆగస్టు 5 నుంచి 7 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

ఆగస్టు 4న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 15-16 శతాబ్దాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని, 1962 నుంచి టీటీడీ వీటిని పునరుద్ధరించిందని తెలిపింది.

కార్యక్రమ వివరాలు:
ఆగస్టు 5-7: ఉదయం 9-11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపనతిరుమంజనం.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఆగస్టు 5: పవిత్రాల ప్రతిష్ట.
ఆగస్టు 6: పవిత్ర సమర్పణ.
ఆగస్టు 7: పూర్ణాహుతి.

సేవల రద్దు:
ఆగస్టు 4: సహస్రదీపాలంకార సేవ.
ఆగస్టు 5: అష్టదళ పాద పద్మారాధన సేవ.
ఆగస్టు 7: తిరుప్పావడ సేవ.
ఆగస్టు 5-7: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు.

భక్తులు ఈ వివరాలను గమనించి, తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."