Kitchenvantalu

Pullattu :అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి “పుల్లట్లు” – రేషన్ బియ్యంతో అద్దిరిపోయే రెసిపీ..

Pullattu :అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి “పుల్లట్లు” – రేషన్ బియ్యంతో అద్దిరిపోయే రెసిపీ.. పూర్వకాలంలో ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహారాల్లో పుల్లట్లు ఒకటి. అయితే, ప్రస్తుత కాలంలో వీటిని తినే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.

పుల్లట్లు తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. కొందరు దోసె పిండిలో పుల్లటి పెరుగు లేదా పుల్లటి మజ్జిగను కలిపి పుల్లట్లను తయారు చేస్తారు. మరికొందరు దోసె పిండిని 15 గంటలు లేదా ఒక రోజంతా పులియనిచ్చి, మరుసటి రోజు పుల్లట్లుగా వేస్తారు.

పుల్లట్ల పిండిలో శరీరానికి మేలు చేసే బాక్టీరియా సమృద్ధిగా ఉంటుంది, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పిండిలో కొద్దిగా మీగడ లేదా వెన్న కలిపితే పుల్లట్లు మెత్తగా వస్తాయి. వీటిని నెయ్యి లేదా నూనె లేకుండా కూడా కాల్చవచ్చు. రోజూ తినే అల్పాహారాలకు బదులుగా అప్పుడప్పుడూ పుల్లట్లను తయారు చేసి తినవచ్చు. బరువు తగ్గడానికి కఠిన ఆహార నియమాలను పాటించే వారు కూడా ఇవి తినవచ్చు, ఎందుకంటే పుల్లట్లు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు.

శరీరానికి హాని కలగకుండా బరువు తగ్గాలనుకునే వారికి పుల్లట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి, తయారీలో ఎక్కువ ఉప్పు వాడాల్సిన అవసరం లేదు. అందువల్ల రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. పుల్లట్లు శరీరానికి ఎలాంటి హాని చేయవు. వీటిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా టమాట చట్నీతో కలిపి తింటే రుచి మరింత బాగుంటుంది.