Kitchenvantalu

Towel Cleaning Tips: మీరు వాడే టవల్ ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా.. ఈ తప్పు అసలు చేయకండి..

Towel Cleaning Tips: మీరు వాడే టవల్ ని ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలో తెలుసా.. ఈ తప్పు అసలు చేయకండి.. చాలామంది రోజూ ఒకే టవల్‌ను వాడతారు, ముఖ్యంగా వర్షాకాలంలో తడి టవల్‌నే పదేపదే ఉపయోగిస్తారు.

అయితే, శుభ్రంగా లేని టవల్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? టవల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, అది అనేక చర్మ సమస్యలకు కారణమవుతుంది. స్నానం తర్వాత శరీరాన్ని తుడిచేటప్పుడు, చనిపోయిన చర్మ కణాలతో పాటు గాలిలోని ధూళి, దుమ్ము, క్రిములు టవల్‌లో చేరతాయి.

ఇలాంటి టవల్‌ను ఎక్కువ రోజులు వాడితే చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో టవల్ మందంగా ఉండటం వల్ల ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. తడి వాతావరణం కారణంగా టవల్ పూర్తిగా ఆరకుండా ఉంటుంది, ఫలితంగా బ్యాక్టీరియా, క్రిములు చేరుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తడి టవల్ వాడటం వల్ల రింగ్‌వార్మ్, గజ్జి వంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.

ముఖంపై మొటిమలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నప్పుడు, టవల్‌లో చేరిన క్రిములు మళ్లీ వాడినప్పుడు ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకే, టవల్‌ను ఎక్కువ రోజులు ఉతకకుండా ఉపయోగించడం మానేయాలి.

టవల్‌ను ఎలా శుభ్రం చేయాలి?
ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే, టవల్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి:

తరచూ శుభ్రం చేయండి: ఇంట్లో ప్రతి ఒక్కరూ రెండు టవల్స్ ఉపయోగించడం మంచిది. ఒక టవల్ వాడిన తర్వాత మరొకటి వాడొచ్చు.

క్రమం తప్పకుండా ఉతకండి: వారానికి కనీసం 3-4 సార్లు టవల్‌ను ఉతకాలి. వర్షాకాలంలో తరచూ ఉతకడం చాలా ముఖ్యం. సాధారణ రోజుల్లో 5-6 రోజులకు ఒకసారి ఉతికితే సరిపోతుంది.

వేడి నీటిలో నానబెట్టండి: టవల్‌ను వేడి నీటిలో సబ్బుతో నానబెట్టి ఉతకాలి. కొద్దిగా ఉప్పు లేదా బేకింగ్ సోడా వాడితే క్రిములు నశిస్తాయి.

ఎండలో ఆరబెట్టండి: ఉతికిన టవల్‌ను ఎండలో ఆరబెట్టడం ఉత్తమం. ఎండలోని UV కిరణాలు క్రిములను నాశనం చేస్తాయి. ఎండ లేని రోజుల్లో వాషింగ్ మెషిన్ డ్రైయర్‌లో ఆరబెట్టి, గాలిలో కొంతసేపు ఆరిన తర్వాతే వాడండి.

ఈ సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ