Healthhealth tips in telugu

Sharp Brain: పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా ధృఢంగా, ఉండాలంటే… మైండ్ షార్ప్ చేసే ఆహారాలు..

Sharp Brain: పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా ధృఢంగా, ఉండాలంటే… మైండ్ షార్ప్ చేసే ఆహారాలు.. చిన్న పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా, తెలివిగా ఎదగాలంటే వారికి సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యమని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల మెదడు చురుకుగా పని చేయడానికి, వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఏ ఆహారాలు అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

8 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు ఇవ్వడం చాలా మంచిది. గుడ్డులో విటమిన్ B12, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆకు కూరలు, ముఖ్యంగా మెంతి, పాలకూర, ఇతర కూరగాయలతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ పిల్లలకు అందించాలి. ఇవి వారిని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ పండ్లను ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు తినడం ద్వారా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి, ఇవి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఓట్స్, బ్రౌన్ రైస్, ధాన్యాలు, గోధుమ రొట్టెలలో కార్బోహైడ్రేట్లు మరియు B-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు రోజూ ఇవ్వడం వల్ల వారి మెదడు చురుకుగా పని చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ