Uric Acid: జస్ట్ ఈ డ్రింక్స్ తాగితే చాలు.. ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు..
Uric Acid: జస్ట్ ఈ డ్రింక్స్ తాగితే చాలు.. ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. గౌట్, కిడ్నీ రాళ్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

శరీరం యూరిక్ యాసిడ్‌ను సరిగా బయటకు పంపలేనప్పుడు, అది కీళ్లలో స్ఫటికాల రూపంలో చేరి నొప్పి, వాపును కలిగిస్తుంది.యూరిక్ యాసిడ్‌ను ఇంట్లోనే సులభంగా తగ్గించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి! ఈ సాధారణ డ్రింక్స్‌తో ఆ సమస్యను నియంత్రించవచ్చు.

ఈ సమస్యల నివారణకు తగినంత నీరు తాగడం చాలా కీలకం. నీరు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా, యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో దాన్ని నియంత్రించవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చౌ చౌ డ్రింక్
చౌ చౌ డ్రింక్ తయారీకి కావలసినవి: సగం కప్పు చౌ చౌ ముక్కలు, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ సోంపు పొడి.
తయారీ విధానం: చౌ చౌ కాయను శుభ్రంగా కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఆ ముక్కలకు కొద్దిగా పసుపు వేసి మళ్లీ కడిగి, మిక్సీలో కొంచెం నీటితో మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ రసాన్ని వడకట్టి, అందులో జీలకర్ర పొడి, సోంపు పొడి కలిపి తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్

యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి మరో సమర్థవంతమైన డ్రింక్. ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతూ, కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ డ్రింక్‌ను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా ప్రకారం ఇక్కడ వివరించబడింది. ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

