Onion Pakoda:వేడి వేడిగా కారం కారంగా 5 నిమిషాల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీ (సీక్రెట్ రెసిపీ)
Onion Pakoda:వేడి వేడిగా కారం కారంగా 5 నిమిషాల్లో కరకరలాడే ఉల్లిపాయ పకోడీ (సీక్రెట్ రెసిపీ).. ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. చాలా మంది వీటిని రోజూ పచ్చిగా తింటారు. ఉల్లిపాయలు శరీరానికి చలవను అందిస్తాయి, ముఖ్యంగా వేసవిలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. పెరుగు లేదా మజ్జిగతో ఉల్లిపాయలను కలిపి తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

అలాగే, కొందరు ఉల్లిపాయలతో పకోడీలు తయారు చేసి తింటారు. సాయంత్రం సమయంలో బయటి చిరుతిండితో పోలిస్తే, ఉల్లిపాయ పకోడీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇంట్లో తక్కువ నూనెతో వీటిని వేయించుకుంటే ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఉల్లిపాయ పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు:
పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది)
ఉప్పు – రుచికి సరిపడా
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2
తరిగిన కరివేపాకు – కొద్దిగా
తరిగిన అల్లం ముక్కలు – 1 టీ స్పూన్
పసుపు – 1/4 టీ స్పూన్
కారం – 1/4 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
చిన్నగా తరిగిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
శనగపిండి – 1/2 కప్పు
నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలను చేత్తో నలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.10 నిమిషాల తర్వాత, నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలను గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.

ఒక కళాయిలో నూనె పోసి, అది వేడి అయ్యాక ఉల్లిపాయ మిశ్రమాన్ని పకోడీల ఆకారంలో వేసి, ఎర్రగా వేగే వరకు వేయించాలి.వేయించిన పకోడీలను టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదనపు నూనె శోషించబడుతుంది.రుచికరమైన ఉల్లిపాయ పకోడీలు సిద్ధం! వీటిని నేరుగా లేదా టొమాటో కెచప్‌తో సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

