Kitchenvantalu

Banana Halwa : “అర‌టి పండ్లతో హ‌ల్వా”.. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు..

Banana Halwa : “అర‌టి పండ్లతో హ‌ల్వా”.. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరటి పండ్లు తినడం ద్వారా జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటివి తగ్గుతాయి.

అరటి పండ్లను నేరుగా తినడంతో పాటు, వీటితో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. అలాంటి వంటకాల్లో అరటి పండ్ల హల్వా ఒకటి. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా, సులభంగా తయారు చేయవచ్చు. అరటి పండ్ల హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండ్ల హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
అరటి పండ్లు – 2
చక్కెర – 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 2 టీస్పూన్లు
యాలకుల పొడి – 1/4 టీస్పూన్
Banana Benefits
అరటి పండ్ల హల్వా తయారీ విధానం:
ఒక నాన్‌స్టిక్ పాన్‌లో చక్కెర, నీళ్లు వేసి, సన్నని మంటపై చక్కెర పూర్తిగా కరిగే వరకు మరిగించాలి.అరటి పండ్లను చిన్న ముక్కలుగా తరిగి, చక్కెర మిశ్రమంలో వేసి, 10 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉడికించాలి.

తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అరటి ముక్కలను మెత్తగా చిదిమి, 1 టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి.మళ్లీ సన్నని మంటపై పెట్టి, పదార్థం మధ్యకు చేరి పాన్ అంచులను వదిలేవరకు ఉడికించాలి.

చివరగా యాలకుల పొడి వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి.చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తే, రుచికరమైన అరటి పండ్ల హల్వా సిద్ధం.. ఈ హల్వాను నేరుగా తినవచ్చు, ఇది చాలా రుచిగా ఉంటుంది.