Egg Fried Rice : ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ తో ఇలా “ఎగ్ ఫ్రైడ్ రైస్” ని సింపుల్ గా చేసేయండి
Egg Fried Rice : ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ తో ఇలా “ఎగ్ ఫ్రైడ్ రైస్” ని సింపుల్ గా చేసేయండి.. బాస్మతి బియ్యంతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తాం. ముఖ్యంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ల తయారీలో బాస్మతి బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఫ్రైడ్ రైస్లలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక రుచికరమైన వంటకం, ఇది బయట ఎక్కువగా లభిస్తుంది. అయితే, ఇంట్లో కూడా ఇదే రుచితో ఈ వంటకాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం – 250 గ్రాములు
కోడిగుడ్లు – 3
తరిగిన అల్లం వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
తరిగిన క్యాప్సికం – 1
తరిగిన ఉల్లిపాయ – 1
క్యాబేజ్ తురుము – 1 కప్పు
తరిగిన క్యారెట్ – 1
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3
నూనె – 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
కారం – ½ టేబుల్ స్పూన్
మిరియాల పొడి – ¼ టీ స్పూన్
గరం మసాలా – ½ టేబుల్ స్పూన్
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
వెనిగర్ – 1 టేబుల్ స్పూన్

ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి 95% ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడకకుండా, కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, మంట మీద కాగిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టి వేసి బాగా వేయించాలి. వేగిన గుడ్ల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, మధ్యస్థ మంటపై తరిగిన క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్ తురుము, క్యారెట్ వేసి బాగా వేయించాలి.కూరగాయలు పూర్తిగా వేగిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసి కలపాలి.ఇప్పుడు ఉడికించిన బాస్మతి బియ్యాన్ని కళాయిలో వేసి జాగ్రత్తగా కలపాలి.

తర్వాత కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.చివరగా సోయా సాస్, వెనిగర్ వేసి, పెద్ద మంటపై 3-4 నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.4 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయాలి.
ఈ విధంగా చేస్తే రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధమవుతుంది. ఈ పద్ధతిలో తయారు చేస్తే బయట దొరికే రుచిని ఇంట్లోనే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ బాస్మతి బియ్యం అందుబాటులో లేకపోతే, సాధారణ బియ్యంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేయవచ్చు. ఈ రెసిపీతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అద్భుతమైన రుచితో తయారవుతుంది.

