Devotional

Vinayaka Chavithi 2025 : ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు? పూజకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసా..?

Vinayaka Chavithi 2025 : ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు? పూజకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసా.. ఈ సంవత్సరం 2025, విశ్వావసు నామ సంవత్సరంలో వినాయక చవితి పండుగను ఆగస్టు 27 (బుధవారం) రోజున ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి తిథి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమవుతుంది. ఆగస్టు 27న ఉదయం 5:20 గంటల నుంచి 7:20 గంటల వరకు స్థిర లగ్నం (సింహ లగ్నం) ఉంటుంది, దీనిని పండితులు శుభ ముహూర్తంగా పేర్కొంటున్నారు.

వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథినాడు ఈ పండుగ జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది, ఈ మాసంలో తొలి పండుగగా వినాయక చవితి వస్తుంది. ఆగస్టు 27 నుంచి 10 రోజుల పాటు, అంటే తొమ్మిది రాత్రులు, గణేశ చతుర్థిని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో గణనాథుడిని పూజించి, చివరగా చెరువులు, కాలువల్లో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

వినాయక చవితి శుభ ముహూర్తం
2025 విశ్వావసు నామ సంవత్సరంలో ఆగస్టు 27న వినాయక చవితి జరుగుతుంది. తిథి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 27న ఉదయం 5:20 నుంచి 7:20 గంటల వరకు స్థిర లగ్నం (సింహ లగ్నం) ఉంటుంది, ఇదే శుభ ముహూర్తంగా పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో దీపం వెలిగించి పూజ ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు. అలాగే, ఉదయం 11:35 నుంచి 11:50 గంటల మధ్య వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవడం శుభప్రదమని చెప్పారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సంతోషకరమైన వార్తను వెల్లడించింది. నగరంలో 34 ప్రాంతాల్లో పర్యావరణ అనుకూల మట్టి గణేష విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఆగస్టు 24 నుంచి 26 వరకు ఈ విగ్రహాలను పంపిణీ చేస్తారని, మొత్తం ఒక లక్ష విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

గణనాథుడి విగ్రహం ఎలా ఉండాలి?
వినాయకుడి విగ్రహం ఎంపికలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. గణేశుడి తొండం ఏ వైపు ఉండాలనే సందేహం చాలామందిలో ఉంటుంది. కోరికలు నెరవేరాలంటే, పూజించే వినాయకుడి విగ్రహం లేదా చిత్రంలో తొండం ఆయనకు ఎడమవైపు వంగి ఉండటం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."