Vinayaka Chavithi Prasadalu:వినాయక చవితి ప్రసాదాలు.. పాల ఉండ్రాళ్ళు..
Vinayaka Chavithi Prasadalu:వినాయక చవితి ప్రసాదాలు.. పాల ఉండ్రాళ్ళు.. వినాయకునికి ఇష్టమైన పిండి వంటలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పాల ఉండ్రాళ్ళకు కావలసిన పదార్ధాలు మరియు తయారి విధానం తెలుసుకుందాం.

గణనాధునికి అత్యంత ఇష్టమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు. ఈ ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపు పిండి – 1½ కప్పు, పాలు – 2½ కప్పులు, చక్కెర – 100 గ్రాములు, యాలకుల పొడి – చిటికెడు, సాబుదానా (సగ్గుబియ్యం) – 3 టేబుల్ స్పూన్లు, నూనె – ¼ టీస్పూన్.
తయారీ విధానం:
ఒక గిన్నెలో 1½ కప్పు బియ్యపు పిండికి 3 కప్పుల నీళ్లు, ¼ టీస్పూన్ నూనె వేసి మరిగించాలి. అందులో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆ పిండిని చల్లారిన తర్వాత, చేతులకు కొద్దిగా నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఈ ఉండలను ఆవిరిపై 10-15 నిమిషాలు ఉడికించాలి.
ఇంతలో, మరో గిన్నెలో 2½ కప్పుల పాలు పోసి మరిగించాలి. పాలలో 3 టేబుల్ స్పూన్ల సాబుదానాను 15 నిమిషాలు నానబెట్టి, తర్వాత చక్కెర (100 గ్రాములు), చిటికెడు యాలకుల పొడి వేసి, సన్నని మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యేలా కొద్దిగా బియ్యపు పిండి (అవసరమైతే) వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించిన ఉండలను ఈ పాల మిశ్రమంలో వేసి, సన్నని మంటపై 4 నిమిషాలు ఉంచి దించేయాలి. ఇలా తయారైన పాల ఉండ్రాళ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

