Vinayaka Chavithi Prasadalu:వినాయక చవితి ప్రసాదాలు.. మోదక్..
Vinayaka Chavithi Prasadalu:వినాయక చవితి ప్రసాదాలు.. మోదక్.. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా పెడితే మనం అనుకున్న కోరికలు తీరతాయి. ఇక ఇప్పుడు కావలసిన పదార్ధాలు మరియు తయారి విధానం గురించి తెలుసుకుందాం.
మోదక్ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:
బియ్యపు పిండి: 1 కప్పు
నెయ్యి: 3 టీస్పూన్లు
బెల్లం తురుము: 1 కప్పు
కొబ్బరి తురుము: 2 కప్పులు
యాలకులు: 3
ఉప్పు: చిటికెడు
తయారీ విధానం:
ముందుగా ఒక కడాయిలో నెయ్యి, బెల్లం తురుము, కొబ్బరి తురుము వేసి మీడియం మంట మీద కలిపి కాల్చాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి, యాలకులు వేసి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించి, అందులో చిటికెడు ఉప్పు, కొంచెం నెయ్యి వేసి కాసేపు ఉంచి, ఆ తర్వాత మంట ఆపి చల్లారనివ్వాలి.
చల్లారిన నీటిలో బియ్యపు పిండిని కలిపి, ఉండలు కట్టకుండా పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఈ ఉండలను చిన్న దొప్పలా చేసి, మధ్యలో బెల్లం-కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి, బంతిలా లేదా మనకు నచ్చిన ఆకారంలో మూసివేయాలి.ఇడ్లీ పాత్రలో గుడ్డ వేసి, సిద్ధం చేసిన మోదకాలను అమర్చి, సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించాలి.ఉడికిన మోదకాలను గణపతికి నైవేద్యంగా సమర్పించాలి.

