Healthhealth tips in telugu

Milk:పాలను ఏ సమయంలో తాగాలో తెలుసా.. ఈ సమస్యలు ఉన్న వారు పాలు తాగితే..

Milk:పాలను ఏ సమయంలో తాగాలో తెలుసా.. ఈ సమస్యలు ఉన్న వారు పాలు తాగితే.. పాలు మన శరీరానికి అవసరమైన దాదాపు అన్ని పోషకాలను అందిస్తాయి. అందుకే వీటిని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. ఈ కారణంగానే పోషకాహార నిపుణులు, వైద్యులు ప్రతిరోజూ పాలు తాగాలని సిఫార్సు చేస్తారు.

చాలా సంవత్సరాలుగా మానవులు తమ ఆహారంలో పాలను ఒక భాగంగా చేసుకున్నారు. అందుకే ఆవులు, గేదెలను పెంచి సాగుతున్నారు. పాలలో ఉండే వివిధ విటమిన్లు, ఖనిజాలు మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడతాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక ఉన్న ఆహారాలలో పాలు అగ్రస్థానంలో నిలుస్తాయి. ఎందుకంటే, విటమిన్ డి సరిపడా ఉంటేనే శరీరం ఆహారంలోని క్యాల్షియంను గ్రహిస్తుంది. కాబట్టి, ఈ రెండూ ఉండే పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఎముకల బలానికి…
పాలు తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, దంత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారించవచ్చు. వృద్ధాప్యంలో కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి, ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి మరియు మరమ్మతు చేస్తాయి. పాలలోని వే (whey) మరియు కేసీన్ ప్రోటీన్లు అథ్లెట్లకు, శారీరక శ్రమ చేసేవారికి, వ్యాయామం చేసేవారికి ఎంతో ఉపయోగపడతాయి.

ఇవి కండరాలను దృఢంగా చేసి, శరీరానికి చక్కని ఆకృతిని అందిస్తాయి. పాలలో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే, పాలలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

ఎప్పుడు తాగాలి?
పాలలోని ఫాస్ఫరస్ శరీరానికి శక్తిని అందిస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలలోని అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ సమస్యలున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. పాలను ఎప్పుడు తాగాలనే విషయానికి వస్తే, పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి, రాత్రి సమయంలో పాలు తాగడం ఉత్తమం. ఉదయం లేదా మధ్యాహ్నం తాగితే నిద్ర వచ్చి పనులకు ఆటంకం కలగవచ్చు. ఆయుర్వేదం ప్రకారం కూడా రాత్రి పాలు తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి, మానసిక శాంతి లభిస్తుంది. ఇది గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.

ఎవరు తాగకూడదు?
సాధారణంగా అందరూ పాలు తాగవచ్చు, కానీ కొందరికి పాలు తాగడం వల్ల సమస్యలు వస్తాయి. పాలలోని లాక్టోజ్ అనే చక్కెర జాతి సమ్మేళనం కొందరిలో అలర్జీని కలిగిస్తుంది. లాక్టోజ్‌ను జీర్ణించడానికి శరీరంలో లాక్టేజ్ ఎంజైమ్ అవసరం. కానీ కొందరిలో ఈ ఎంజైమ్ తక్కువగా ఉంటుంది లేదా ఉత్పత్తి కాదు. అలాంటి వారు పాలు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
milk
దీన్ని లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్ అంటారు. అలాంటి వారు పాలు తాగకపోవడమే మంచిది. అలాగే, పాలలోని వే, కేసీన్ ప్రోటీన్లు కొందరికి అలర్జీ కలిగించవచ్చు. మొటిమలు అధికంగా ఉన్నవారు, ఐబీఎస్ వంటి జీర్ణ సమస్యలున్నవారు పాలకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ