Healthhealth tips in telugu

Brown Rice |బరువు తగ్గటానికి బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ సమయంలో తింటే మంచిది..?

Brown Rice |బరువు తగ్గటానికి బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ సమయంలో తింటే మంచిది.. ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా, రోజూ తినే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం బాగా పెరిగింది. గతంలో మన పూర్వీకులు, పెద్దలు ఎక్కువగా బ్రౌన్ రైస్‌నే తినేవారు.

దీని వల్ల వారు సుదీర్ఘకాలం రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవించారు. కానీ, ఇప్పుడు చిన్న వయసులోనే గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి రోగాల నుంచి కాపాడుకోవడానికి బ్రౌన్ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. తెల్ల అన్నంతో పోలిస్తే, బ్రౌన్ రైస్‌లో ఎక్కువ పోషకాలు లభిస్తాయి, ఇవి రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి…
బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది, దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా, తక్కువ ఆహారం తీసుకుంటారు, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల, పిండి పదార్థాలు నెమ్మదిగా రక్తంలో గ్లూకోజ్‌గా మారతాయి.

దీంతో ఆహారం తిన్న వెంటనే షుగర్ స్థాయిలు పెరగవు, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా ఉపయోగం. అలాగే, బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, సెలీనియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి, దీంతో గుండెపోటు నుంచి రక్షణ లభిస్తుంది.

షుగర్, థైరాయిడ్ ఉన్నవారికి…
తెల్ల అన్నంతో పోలిస్తే, బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం శరీరంలో 300కు పైగా జీవ రసాయన క్రియలను నిర్వహిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, కండరాలను శాంతపరుస్తుంది, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి సమయంలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా నివారిస్తుంది. షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

బ్రౌన్ రైస్‌లోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవారు బ్రౌన్ రైస్‌ను రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. బ్రౌన్ రైస్‌లో బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి, నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి.
Brown Rice
ఎప్పుడు తినాలి?
బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలుసు. కానీ, దీన్ని ఎంత మోతాదులో, రోజులో ఏ సమయంలో తినాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. పోషకాహార నిపుణుల సలహా ప్రకారం, బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం భోజన సమయంలో తినడం ఉత్తమం. ఈ రైస్‌లో సంక్లిష్ట పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి కాబట్టి, రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణం నెమ్మదిగా జరుగుతుంది, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అందుకే మధ్యాహ్నం తినడం మంచిది. ఉదయం 1-2 గంటలపాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలనుకునేవారు, ఆ పని చేయడానికి ఒక గంట ముందు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది, చురుగ్గా పనిచేయడానికి, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. నీరసం, అలసట ఉండవు. ఇలా బ్రౌన్ రైస్‌ను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ