Today Horoscope:సెప్టెంబర్ 09 రాశి ఫలాలు.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం..
Today Horoscope:సెప్టెంబర్ 09 రాశి ఫలాలు.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం.. సెప్టెంబర్ 09, 2025, మంగళవారం – చాంద్రమానం ప్రకారం 12 రాశుల ఈ రోజు దినఫలాలు తెలుసుకోండి.
09 సెప్టెంబర్ 2025 – మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: విదియ సాయంత్రం 6:28 వరకు, తర్వాత తదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర సాయంత్రం 5:57 వరకు, తర్వాత రేవతి
వర్జ్యం: తెల్లవారుజామున 5:05 నుండి ఉదయం 6:33 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:48 వరకు
మేషం:
చంద్రబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది. పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశం. అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. త్రి నవ యోగం వల్ల ధనపరంగా ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ధనం సమృద్ధిగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. శివారాధన, ఆవునేతి దీపారాధన శుభ ఫలితాలనిస్తాయి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6
వృషభం:
చంద్రబలం అనుకూలంగా ఉంది, కానీ ఇతర గ్రహాల సహకారం తక్కువ. పనులపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులు వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు వృధా ఖర్చు చేయవద్దు. గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 5
మిథునం:
చంద్రబలం అనుకూలంగా ఉంది. అనేక విధాలుగా శుభకరమైన రోజు. ఒప్పందాల విషయంలో సమస్యలు రావచ్చు, జాగ్రత్త. త్రి నవ యోగం వల్ల ధనలాభం సమృద్ధిగా ఉంటుంది, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు కూడా అధికమవుతాయి. ఆడంబర జీవనశైలికి దూరంగా ఉండండి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలం.
లక్కీ కలర్: గోల్డ్
లక్కీ నెంబర్: 6

కర్కాటకం:
గ్రహబలం, ముఖ్యంగా గురు బలం మరియు త్రి నవ యోగం వల్ల ఈ రోజు చాలా అనుకూలం. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. స్టాక్ మార్కెట్‌లో అనుకూల ఫలితాలు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఆంజనేయస్వామి దర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 3
సింహం:
చంద్రబలం తక్కువగా ఉంది. పనుల్లో శ్రమాధిక్యత, ఆలస్యం ఉండవచ్చు. నోటిని అదుపులో ఉంచుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారులు టాక్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్లు చోరీ కాకుండా జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం కాదు. శివారాధన శుభం.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 3
కన్య:
గ్రహబలం అద్భుతంగా ఉంది. త్రి నవ యోగం వల్ల తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. నూతన కార్యక్రమాలకు ఈ రోజు అనుకూలం. ఉద్యోగులకు కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి మంచి రోజు. వ్యాపారులకు భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన గొప్ప ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
తుల:
మిశ్రమ ఫలితాల రోజు. ధన సమస్యలు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ అవసరం. అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్త. వ్యాపారులకు డబ్బు సర్దుబాటు అయినప్పటికీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన తప్పదు. శివుడికి ఆవుపాలు, చక్కెర, తేనె సమర్పిస్తే ఇబ్బందులు తొలగుతాయి.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 5
వృశ్చికం:
గ్రహబలం అనుకూలంగా ఉంది. త్రి నవ యోగం వల్ల ధనలాభం సమృద్ధిగా ఉంటుంది. ఆడంబరాలకు, ఆభరణాల కొనుగోలుకు ఖర్చు చేస్తారు. వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారులకు లాభదాయక రోజు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కొత్త వెంచర్‌లకు అనుకూలం. ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పిస్తే శుభం.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 9
ధనుస్సు:
ఈ రోజు అంతగా అనుకూలం కాదు. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోకండి. దగ్గరి వారిని దూరం చేసుకునే అవకాశం. అపార్థాలు మీకు శత్రువులవుతాయి. కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయండి. వ్యాపారులు శ్రద్ధ వహించాలి. శివారాధన మనశ్శాంతిని ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5
మకరం:
గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంత మానసిక ఆందోళన ఉంటుంది. డబ్బు సమయానికి సర్దుబాటు అవుతుంది, కానీ ఖర్చులు అధికం. వాహన రిపేర్లు ఇబ్బంది పెడతాయి. ఇనుము, నూనె వ్యాపారులకు అనుకూలం కాదు. రియల్ ఎస్టేట్ వారికి పెట్టుబడులకు ఈ రోజు మంచిది కాదు.
లక్కీ కలర్: నలుపు, మయూర నీలం
లక్కీ నెంబర్: 7
కుంభం:
మిశ్రమ ఫలితాల రోజు. పనులు ప్రారంభించే ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. నూతన పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లకు అనుకూలం కాదు. వ్యాపారులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అధిక వడ్డీ అప్పులకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ ఆరాధన ఆపదల నుండి కాపాడుతుంది.
లక్కీ కలర్: గచ్చకాయ రంగు
లక్కీ నెంబర్: 3
మీనం:
అనుకూలమైన రోజు. త్రి నవ యోగం, గురు గ్రహబలం వల్ల తలపెట్టిన పనులు సఫలమవుతాయి. గత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. భూమి లావాదేవీలకు అనుకూలం కాదు. కొత్త ఒప్పందాలు, సంతకాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు డబ్బు రొటేషన్ బాగుంటుంది. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

