Today Horoscope:సెప్టెంబర్ 10 రాశి ఫలాలు.. రాజయోగం పట్టనున్న రాశులు..
Today Horoscope:సెప్టెంబర్ 10 రాశి ఫలాలు.. రాజయోగం పట్టనున్న రాశులు.. సెప్టెంబర్ 10, 2025, మంగళవారం – చాంద్రమాన ఆధారంగా ద్వాదశ రాశులకు ఈ రోజు దినఫలాలు ఇలా ఉంటాయి:
మేషం
ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. కొత్త ఆలోచనలు, నిర్ణయాలతో లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖులతోసంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వాహన యోగం కలిసి వస్తుంది.
వృషభం
మహిళలు ఈ రోజు పిల్లలతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. స్నేహితుల వల్ల కొంత నష్టం రావచ్చు. ఆస్తి రిజిస్ట్రేషన్‌లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఇతరులతో వాదనలు టైంకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మానసికంగా కొంత ఆందోళన ఉండవచ్చు.
మిథునం
పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంత పనులపై దృష్టి పెట్టండి. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం
ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యం రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబ బాధ్యతల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది.
సింహం
జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో లాభాలు అందుకుంటారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో సాయంత్రం సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో కష్టపడి పని చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. అదనపు ఖర్చులు ఎదురవుతాయి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది.
కన్య
బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించండి. స్నేహితులకు సహాయం చేస్తారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడి, అవి ప్రేమగా మారే అవకాశం ఉంది. బంధువుల నుండి సహాయం అందుతుంది.

తుల
మంచి పెట్టుబడులు చేస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. వాహనం కొనే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు పనిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలి. అజాగ్రత్త వల్ల అధికారుల నుండి తిట్లు పడవచ్చు.
వృశ్చికం
రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూల రోజు. ఉద్యోగులు ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారులు చిన్న మార్పులు చేస్తే భారీ లాభాలు పొందవచ్చు. ఇంట్లో విభేదాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి. మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.
ధనుస్సు
కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లలు కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆస్తి సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారంలో మార్పులు చేసి లాభాలు పొందుతారు. స్నేహితులతో శుభ కార్యంలో పాల్గొంటారు. బంధువుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
మకరం
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. పాత స్నేహితుడిని కలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. రావలసిన డబ్బులు చేతికి వస్తాయి. వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం ప్రకృతిలో సమయం గడుపుతారు.
కుంభం
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. కొందరు బంధువులతో విభేదాలు రావచ్చు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. చేపట్టిన పనులు కొంత శ్రమతో పూర్తవుతాయి. రావలసిన డబ్బు సులభంగా అందుతుంది. రాజకీయ నాయకులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది.
మీనం
పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. వివాహానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. యోగా, ధ్యానం చేయడం మంచిది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభిస్తాయి. మహిళలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం పిల్లలతో సంతోషమైన సమయం గడుపుతారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

