Beauty Tips

White Hair:చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా? ఈ ఆహారాలు తింటే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది

White Hair:చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా? ఈ ఆహారాలు తింటే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది..పూర్వం 40, 50 ఏళ్ల తర్వాతే తెల్ల జుట్టు కనిపించేది. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్లలోపే జుట్టు తెల్లబడుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా తెల్ల జుట్టు సమస్యను తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల జుట్టు రావడానికి కారణాలు
వయసు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు రావడం సహజం. అయితే, ఈ రోజుల్లో 20-30 ఏళ్ల వయసులోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, సరైన జుట్టు సంరక్షణ లేకపోవడం, ఒత్తిడి వంటివి దీనికి ప్రధాన కారణాలు. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు తగ్గినప్పుడు జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం, పొడిగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, కొన్ని ఆహారాలను రోజూ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.

1. కరివేపాకు
కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు జుట్టును నల్లగా ఉంచడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 8-10 కరివేపాకు ఆకులను నమిలి తింటే, జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరిగి తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఫలితంగా జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కరివేపాకును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

2. ఉసిరికాయ
ఉసిరికాయ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి జుట్టు మూలాలను బలోపేతం చేసి, తెల్ల జుట్టు రాకుండా నిరోధిస్తాయి. రోజూ ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. అలాగే ఉసిరి పొడిని ఆవ నూనెలో మరిగించి ఆ నూనెను వడకట్టి తలకు రాస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమమగ నల్లగా మారుతుంది. అలాగే ఉసిరి పేస్ట్ ను జుట్టుకు పట్టించిన మంచి పలితం ఉంటుంది.

3. నల్ల నువ్వులు
నల్ల నువ్వులు ఆరోగ్యానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. రోజూ ఒక టీస్పూన్ నల్ల నువ్వుల నూనెను జుట్టుకు రాసుకోవడం లేదా సాధారణంగా ఉపయోగించే నూనెలో కలిపి రాసుకోవడం ద్వారా జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

4. నల్ల జీలకర్ర
నల్ల జీలకర్రలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాక, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. నల్ల జీలకర్ర తలలో రక్తప్రసరణను మెరుగుపరచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు నల్ల జీలకర్రతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

5.గోధుమ గడ్డి..
జుట్టు చిన్న వయసులోనే తెల్లగా మారడాన్ని నివారించడంలో గోధుమ గడ్డి ప్రభావవంతంగా ఉంటుంది. గోధుమ గడ్డి వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది.జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. శరీరంలో టాక్సన్లను తొలగిస్తుంది. తాజా గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకుని తాగవచ్చు లేదా గోధుమ గడ్డి పౌడర్ ను కూడా వినియోగించవచ్చు. గోధుమ గడ్డిని ఇంటిలో పెంచుకోవచ్చు..లేదంటే మార్కెట్ లో దొరికే గోధుమ గడ్డి powder ని కొనుగోలు చేయవచ్చు.

ముగింపు
తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి కరివేపాకు, ఉసిరికాయ, నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర వంటి ఆహారాలను రోజూ తీసుకోవడం ద్వారా జుట్టు నల్లగా, ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది. అలాగే, ఒత్తిడిని తగ్గించడం, సరైన జుట్టు సంరక్షణ పాటించడం కూడా ముఖ్యం. ఇప్పుడు చెప్పిన ఆహారాలు అన్ని మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."