Mango Leaves Benefits : మామిడి ఆకుల్లో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు..
Mango Leaves Benefits : మామిడి ఆకుల్లో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు.. మామిడి సీజన్ ముగిసింది. వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, మామిడి పండ్లతో పాటు మామిడి ఆకులు కూడా అనేక పోషకాలతో నిండి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటమే కాక, వివిధ వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగపడతాయి. మామిడి ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:
మామిడి ఆకులు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మామిడి ఆకుల నీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
దంత సమస్యల నివారణ:
మామిడి ఆకులు దంత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఈ ఆకులను ఉడికించి, ఆ నీటితో పుక్కిలించడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి పెంపు:
మామిడి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం:
మామిడి ఆకులను ఉడికించి, ఆ నీటి ఆవిరిని పీల్చడం వల్ల దద్దుర్లు, శ్వాసకోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
బరువు నియంత్రణ:
మామిడి ఆకుల నీరు రోజూ తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
రక్త శుద్ధి:
మామిడి ఆకులు శరీరంలోని విష పదార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో దివ్యౌషధంలా పనిచేస్తాయి.
గుండె ఆరోగ్యం:
మామిడి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా ఈ ఆకుల నీరు తాగడం ద్వారా నయం చేసుకోవచ్చు. ఇది శరీరంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
క్యాన్సర్ నిరోధక గుణాలు:
మామిడి ఆకుల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో ఇవి సహాయపడతాయి.
జుట్టు సమస్యలకు పరిష్కారం:
మామిడి ఆకులు జుట్టు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు అకాల బూడిద రంగును నివారిస్తాయి. అలాగే, విటమిన్ ఎ, సి లు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి, దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
మామిడి ఆకుల నీరు తయారీ విధానం:
ఒక పాత్రలో రెండు గ్లాసుల నీరు పోసి, స్టవ్ మీద ఉంచండి. 2 నుంచి 4 మామిడి ఆకులను వేసి, నీరు సగానికి తగ్గే వరకు బాగా మరిగించండి. తర్వాత వడకట్టి, చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కొద్దిగా తేనె కలిపి తాగండి. ప్రతిరోజూ ఉదయం ఈ విధంగా తీసుకుంటే, త్వరలోనే అద్భుతమైన ఫలితాలను గమనిస్తారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

