Kitchenvantalu

Mirchi Bajji:రోడ్‌సైడ్ ఉల్లిపాయ స్టఫ్డ్ “మిర్చీ బజ్జీ” – క్రిస్పీ, నూనె ఎక్కువగా పీల్చని రుచికరమైన స్నాక్!

Mirchi Bajji with Onion Stuffing: రోడ్‌సైడ్ ఉల్లిపాయ స్టఫ్డ్ “మిర్చీ బజ్జీ” – క్రిస్పీ, నూనె ఎక్కువగా పీల్చని రుచికరమైన స్నాక్.. ఎప్పుడూ ఒకే రకం బజ్జీలు తిని విసిగిపోయారా? ఈసారి కాస్త భిన్నంగా ఉల్లిపాయ స్టఫ్ఫింగ్‌తో మిర్చీ బజ్జీలు ట్రై చేయండి, అదిరిపోతాయి!

బజ్జీలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వేడివేడిగా, క్రిస్పీగా ఉండే ఈ బజ్జీలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా తింటారు. కానీ ఎప్పుడూ ఒకే రుచి తింటే బోర్ కొడుతుంది కదా! అందుకే ఈ ఉల్లిపాయ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలను ఓసారి ప్రయత్నించండి. బయట క్రంచీగా, లోపల స్పైసీగా ఉండే ఈ బజ్జీలు తింటే ఆ రుచి మీకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇవి తయారు చేయడం కూడా చాలా సులభం. మరి ఆలస్యం ఎందుకు? ఈ కమ్మని ఉల్లిపాయ స్టఫ్డ్ మిర్చీ బజ్జీల తయారీ విధానం చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
స్టఫ్ఫింగ్ కోసం:
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 4 (సన్నగా తరిగినవి)
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్

బజ్జీల కోసం:
బజ్జీ మిరపకాయలు – 10
శనగపిండి – 2 కప్పులు
బియ్యప్పిండి – ½ కప్పు
కారం పొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – ½ టీస్పూన్
వాము – ½ టీస్పూన్
ఉప్పు – సరిపడా
నీరు – అవసరానికి తగినంత

తయారీ విధానం:
మిరపకాయల తయారీ:
బజ్జీ మిరపకాయలను ఒక గిన్నెలో వేసి, సరిపడా నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడిగి, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టండి.ఉల్లిపాయ స్టఫ్ఫింగ్ తయారీ:ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని చిన్నగా తరిగి ఒక గిన్నెలో వేయండి.అందులో కారం పొడి, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచండి.

బజ్జీ పిండి తయారీ:
మరో గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం పొడి, ధనియాల పొడి, వాము, ఉప్పు వేసి కలపండి.కొద్ది కొద్దిగా నీరు పోస్తూ, బజ్జీలకు సరిపడే సాంద్రత కలిగిన పిండిని తయారు చేసి పక్కన పెట్టండి.

మిరపకాయల స్టఫ్ఫింగ్:
కడిగిన మిరపకాయలను శుభ్రంగా తుడిచి, ప్రతి మిరపకాయను మధ్యలో కొద్దిగా కోసి, లోపలి గింజలను తీసేయండి.తయారు చేసిన ఉల్లిపాయ మిశ్రమాన్ని మిరపకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయండి.

వేయించడం:
స్టవ్ ఆన్ చేసి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.నూనె వేడెక్కిన తర్వాత, మంటను మీడియంకు తగ్గించి, స్టఫ్ చేసిన మిరపకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేయండి.కడాయిలో సరిపడినన్ని మిరపకాయలు వేసి, మీడియం మంటలో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించండి.

సర్వింగ్:
వేగిన బజ్జీలను ఒక గిన్నెలోకి తీసి, మిగిలిన మిరపకాయలను కూడా ఇలాగే వేయించండి. వేడివేడిగా సర్వ్ చేస్తే, క్రిస్పీగా, స్పైసీగా ఉండే ఉల్లిపాయ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలు రెడీ!

చిట్కాలు:
మిరపకాయల ఎంపిక: లావుగా ఉండే బజ్జీ మిరపకాయలను ఎంచుకుంటే, గింజలు తీయకుండానే స్టఫ్ఫింగ్ సులభంగా చేయవచ్చు. లావు తక్కువ ఉన్నవి వాడితే, గింజలు తీసేస్తే పిల్లలు కూడా సులభంగా తినగలరు.
గమనిక: సాధారణ బజ్జీల్లా చివర్లు కట్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కొద్దిగా కోసి స్టఫ్ చేసి నేరుగా వేయించుకోవచ్చు.