BusinessToday gold rate

Gold Rate Today:బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎంతగా పెరిగాయంటే..

Gold Rate Today:బంగారం కొనుగోలుదారులకు మళ్లీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎంతగా పెరిగాయంటే.. నేడు నవంబర్ 11వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,830గా నమోదైంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,350గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,56,000గా ట్రేడ్ అవుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే బంగారం ధరలు నేడు పెరిగాయి. అయినప్పటికీ, ఆల్ టైం రికార్డు స్థాయి కంటే దాదాపు రూ. 9,000 తక్కువగా ఉంది. ఆల్ టైం రికార్డు ధర రూ. 1.35 లక్షలు కాగా, ప్రస్తుత ధర దానికంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి:సౌండ్‌బార్లపై ఆకర్షణీయ ఆఫర్లు.. రూ.1,000 కంటే తక్కువ ధరలోనే..
గడచిన వారం రోజులుగా బంగారం ధరలు తక్కువ స్థాయిలోనే కదుగుతున్నాయి. ధరల తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 3,950 డాలర్ల కంటే దిగువన ఉంది. అక్టోబర్ 20న ఇది 4,385 డాలర్లతో ఆల్ టైం రికార్డు సాధించింది.
బంగారం ధర తగ్గడానికి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు నిల్వలను తగ్గించుకోవడం మరో కారణం. సెప్టెంబర్‌లో కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేశాయి. వీటిలో బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ 15 టన్నులతో అగ్రస్థానంలో ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
ఇది కూడా చదవండి:తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు ఇచ్చే టాప్ 5 పొదుపు పథకాలు! మీకు ఏది సరిపోతుందో ఇప్పుడే తెలుసుకోండి!
మరోవైపు, అమెరికా-చైనా మధ్య ఇటీవల ట్రేడ్ ఒప్పందం కుదిరింది. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆర్థిక ఒత్తిడి సమయాల్లో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం సమస్యలు తగ్గుతుండటంతో బంగారం నుంచి నిధులను ఉపసంహరించి, బాండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

డిస్‌క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ నిర్ణయాలకు chaipakodi ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాలకు ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."