Gold Rate Today:మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today:మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే.. నవంబర్ 12 బుధవారం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,530కు చేరగా, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ. 1,16,150గా నమోదైంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,58,511కు పలుకుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు పసిడి ధరలు గణనీయంగా ఎగసాయి.
గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర మళ్లీ 4,000 డాలర్ల మార్కును దాటి 4,118 డాలర్లకు చేరింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి.
Also Read:రెట్టింపు అందం కోసం.. ఫేస్ క్రీములు అవసరమే లేదు… ఇలా చేస్తే చాలు..
అమెరికా చరిత్రలోనే అతి దీర్ఘకాలిక ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆర్థిక డేటా అందుబాటులో లేకపోవడం, ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు మళ్లడం ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ప్రైవేట్ ఏజెన్సీల గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య తగ్గింది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పడ్డాయి. డాలర్ విలువలో క్షీణత కూడా బంగారం ధరలను బలపరుస్తోంది.
సీఎన్‌బీసీ కథనం ప్రకారం, కిట్‌కో మెటల్స్ విశ్లేషకుడు జిమ్ వైకాఫ్ మాట్లాడుతూ – బలహీనమైన ఆర్థిక డేటా కారణంగా డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశం పెరిగిందని, దీంతో బంగారం, వెండిపై డిమాండ్ పుంజుకుందని తెలిపారు.
Also Read:వాట్సాప్‌లో డిలిట్ అయిన మెసేజ్‌లను ఈ సులువైన ట్రిక్స్‌తో తిరిగి పొందండి..
స్విస్ బ్యాంక్ అంచనా ప్రకారం భవిష్యత్తులో బంగారం ధర ఔన్స్‌కు 4,700 డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం, ముఖ్యంగా గోల్డ్ ETFల వైపు ఆకర్షితులవుతున్నారు.
డిస్‌క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. బంగారం, వెండి, స్టాక్స్, క్రిప్టో వంటి అన్ని పెట్టుబడులు రిస్క్‌కు లోనవుతాయి. నిర్ణయాలకు ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి. chaipakodi ఎటువంటి బాధ్యత వహించదు.

