Business

Silver Price:వెండి ధర మళ్లీ భారీగా పెరుగుతోంది… సిల్వర్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి… భవిష్యత్తులో కిలో వెండి రూ.3 లక్షలు అయ్యే అవకాశం..

Silver Price:వెండి ధర మళ్లీ భారీగా పెరుగుతోంది… సిల్వర్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి… భవిష్యత్తులో కిలో వెండి రూ.3 లక్షలు అయ్యే అవకాశం..
వెండిని కేవలం ఆభరణాలు, అలంకరణ కోసం మాత్రమే కాదు… గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీలో, ఎలక్ట్రిక్ వాహనాల్లో, అణు రియాక్టర్లలో వెండి వాడకం గణనీయంగా ఉందని నిపుణులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీపై దృష్టి పెరిగింది. ఈ నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ గణంగా పెరిగింది. సోలార్ ఎనర్జీ డిమాండ్ పెరిగే కొద్దీ ప్యానెల్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది – దీంతో వెండి వినియోగం కూడా పెరుగుతోంది.

మార్కెట్‌లో వెండి ధర మళ్లీ ఊపందుకుంది. అక్టోబర్‌లో కేజీ రూ.2 లక్షలకు చేరిన ధర… తర్వాత రూ.1.50 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పారిశ్రామిక డిమాండ్ కారణంగానే ధర పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి వెండి ధర దాదాపు మూడింతలు పెరిగింది. కానీ గడిచిన రెండు వారాల్లో భారీ పతనం సంభవించింది – టెక్నికల్ కారణాలతోనని నిపుణులు అంచనా. అయితే ఇప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కారణంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతి అడ్డంకులు తొలగాయి.

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో కదలిక మొదలైంది. వెండి దిగుమతులకు పోటీ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెండి మైనింగ్ తక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణం. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ పెరుగుదల సాధ్యమని నిపుణుల అభిప్రాయం.

పెట్టుబడి ఎలా పెట్టాలి?
వెండి ఈటీఎఫ్‌లు ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి – వీటిలో పెట్టుబడి సురక్షిత మార్గం. అలాగే సిల్వర్ మైనింగ్ కంపెనీల లిస్టెడ్ షేర్లలో పెట్టుబడి కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుందని నిపుణుల సూచన.

డిస్‌క్లైమర్: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి పెట్టుబడులన్నీ నష్టాలకు లోనవుతాయి. మీ నిర్ణయాలకు chaipakodi బాధ్యత వహించదు. పెట్టుబడి ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."