Cough: జలుబు, దగ్గు వేధిస్తోందా? మందులు లేకుండానే త్వరగా ఉపశమనం పొందే అద్భుత చిట్కా!
Cough: జలుబు, దగ్గు వేధిస్తోందా? మందులు లేకుండానే త్వరగా ఉపశమనం పొందే అద్భుత చిట్కా..చిన్న వాతావరణ మార్పు వచ్చినా సరే, చాలా మందికి జలుబు, దగ్గు, ముక్కు కారడం సాధారణ సమస్యే అయిపోయింది. దీని కోసం మళ్లీ మళ్లీ మందులు వేసుకోవడం, డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టడం, వేల రూపాయలు ఖర్చు పెట్టడం… ఇదంతా మీకూ తెలిసిన కథే కదా?
ఇక చింత వద్దు! వైద్య నిపుణులు సైతం సిఫారసు చేసే, ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోగలిగే ఒక ప్రాచీన & ప్రభావవంతమైన ఔషధ పొడి మీ జలుబు-దగ్గును రూట్ నుంచి తగ్గిస్తుంది. అదే సమయంలో మీ రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.
కావలసిన పదార్థాలు (రెండే రెండు!)
చిన్న ఏలకులు (గ్రీన్ కార్డమమ్) – 50 గ్రా
లవంగాలు – 50 గ్రా
Also read:కాశీ నుంచి గంగాజలం తెచ్చుకోవడం అశుభమా?
తయారీ విధానం (5 నిమిషాల్లో రెడీ!)
కడాయిలో మంట తక్కువగా పెట్టి, ఏలకులు + లవంగాలను కలిపి 2-3 నిమిషాలు లేతగా వేయించండి (కాలిపోకుండా జాగ్రత్త!).చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడి చేసి, గాలి ఆడని సీసాలో భద్రంగా పెట్టుకోండి.
ఎలా తీసుకోవాలి?
రోజుకు 2 సార్లు (ఉదయం-సాయంత్రం)
1/4 టీస్పూన్ పొడి (సుమారు చిటికెడు)
ఒక టీస్పూన్ తేనెతో కలిపి నోట్లో పెట్టుకొని నెమ్మదిగా మింగండి (లేదా గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగవచ్చు).
ఫలితం ఎప్పుడు కనిపిస్తుంది?
మొదటి డోసు తీసుకున్న 30 నిమిషాల్లోనే గొంతు ఇరిటేషన్ తగ్గి, దగ్గు తగ్గుతుంది. 3-4 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది. అదనంగా జీర్ణక్రియ మెరుగవుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది, శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంట్లో ఉన్న రెండే రెండు మసాలా పదార్థాలతో… మందులు లేకుండా, ఖర్చు లేకుండా… జలుబు-దగ్గుకు శాశ్వత ఉపశమనం..ఇప్పుడే తయారుచేసుకొని ట్రై చేయండి –
Also read:ఉసిరి పొడితో ఇంట్లోనే 100% సహజ హెయిర్ డై.. తెల్ల జుట్టుకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేయొచ్చు..
Also read:ఈ ఒక్క నూనె రాస్తే జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది

