Kitchenvantalu

Fridge Cleaning Tips:ఫ్రిజ్ శుభ్రంగా ఉన్నా దుర్వాసన వస్తోందా? ఈ ౩ సింపుల్ టిప్స్‌లతో శాశ్వతంగా వదిలించుకోండి..

Fridge Cleaning Tips:ఫ్రిజ్ శుభ్రంగా ఉన్నా దుర్వాసన వస్తోందా? ఈ ౩ సింపుల్ టిప్స్‌లతో శాశ్వతంగా వదిలించుకోండి..మనం రోజూ ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, వండిన కూరలు, పచ్చళ్లు… ఇలా అన్నీ కలిపి పెడతాం. కొన్ని రోజులు గడిచాక ఒక్క భయంకరమైన దుర్వాసన మొదలవుతుంది. ఎంత తుడిచి శుభ్రం చేసినా మళ్లీ మళ్లీ వచ్చేస్తుంది.

ముఖ్యంగా కట్ చేసిన పుచ్చకాయ, ఆపిల్, అరటి పండ్లు ఎక్కువ రోజులు ఉంటే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
అయితే ఇకపై ఆ ఇబ్బంది అవసరం లేదు! కేవలం వంటింట్లోనే ఉండే ౩ సాధారణ పదార్థాలతో ఫ్రిజ్‌ను ఎప్పటికీ సువాసనతో నిండినట్టు మార్చేయొచ్చు. ఏమిటా చిట్కాలు? చూద్దాం…
ALSO READ:దీపం ఆరిపోతే మళ్లీ వెలిగించవచ్చా? ఆధ్యాత్మిక పండితులు ఏమంటున్నారు?
1. బేకింగ్ సోడా (వంట సోడా) – నంబర్ వన్ సొల్యూషన్
ఒక చిన్న గాజు గిన్నె లేదా ఓపెన్ బౌల్ తీసుకోండి.౩-4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో ఎక్కడైనా పెట్టండి.ఇది ఫ్రిజ్‌లోని అన్ని చెడు వాసనలను పీల్చేస్తుంది.10 రోజులకోసారి సోడాను మార్చేస్తే చాలు… ఎప్పటికీ దుర్వాసన రాదు.

2. నిమ్మకాయ ముక్కలు – సహజమైన ఫ్రెష్ సుగంధం
ఒక నిమ్మకాయను 2 ముక్కలు కట్ చేయండి.లేదా నిమ్మరసం పిండి ఒక చిన్న గిన్నెలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి.నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ దుర్వాసన కారక బ్యాక్టీరియాను చంపేస్తుంది.అదనంగా ఫ్రెష్ నిమ్మ సుగంధం కూడా వ్యాపిస్తుంది.
ALSO READ:మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా? ఇంట్లోనే ఒక్క సారి ఇలా చేస్తే చాలు..
3. ఉడికించిన వెనిగర్ – అతి శక్తివంతమైన రెమెడీ
ఒక చిన్న గిన్నెలో అరకప్పు వైట్ వెనిగర్ (లేదా ఆపిల్ సైడర్ వెనిగర్) తీసుకోండి.స్టౌవ్ మీద మరిగించి, వేడిగానే మరో ఓపెన్ గిన్నెలోకి మార్చి ఫ్రిజ్‌లో పెట్టండి.
వెనిగర్ ఫ్రిజ్‌లోని ఏ వాసననైనా ఒక్కసారిగా పీల్చేస్తుంది.2-౩ రోజులు పెట్టి తీసేయొచ్చు… ఫ్రిజ్ పర్ఫెక్ట్‌గా ఫ్రెష్ అవుతుంది. ఈ మూడు చిట్కాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచుతూ వస్తే… దుర్వాసన సమస్య ఎప్పటికీ మళ్లీ రాదని గ్యారంటీ!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/