Kitchen Tips:ఫ్రిజ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడని 5 ఆహార పదార్థాలు.. పెడితే ఆరోగ్యానికే ముప్పు!
Kitchen Tips:ఫ్రిజ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడని 5 ఆహార పదార్థాలు.. పెడితే ఆరోగ్యానికే ముప్పు.. ఈ రోజుల్లో ప్రతి ఇంటా ఫ్రిజ్ లేకపోతే ఆశ్చర్యమే! మిగిలిన ఆహారాన్ని చెడిపోకుండా కాపాడుకోవడానికి అందరూ ఫ్రిజ్‌ని మీదే ఆధారపడుతున్నారు.
కానీ తెలియకుండానే కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో పెడితే వాడం వల్ల వాటి పోషక విలువలు పూర్తిగా నాశనమవుతాయి, ఒక్కోసారి విషతుల్యమైనవి కూడా అవుతాయి.ప్రముఖ పోషకాహార నిపుణురాలు సిమ్రత్ కతురియా హెచ్చరిక ప్రకారం.. ఫ్రిజ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడని 5 ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇవే:
ALSO READ:ఈ డ్రింక్స్ తాగితే ఆరోగ్యం + అందం డబుల్ బోనాంజా! ట్రై చేయకపోతే మీరే లాస్!
టమాటాలు
99% మంది టమాటాలను నేరుగా ఫ్రిజ్‌లో పడేస్తారు. కానీ చల్లదనం వల్ల టమాటాలోలోని అతి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ ‘లైకోపీన్’ నాశనమవుతుంది, రుచి కూడా పోతుంది. లైకోపీన్ గుండె జబ్బులను అడ్డుకుంటుంది. కాబట్టి టమాటాలను గది ఉష్ణోగ్రతలో, సూర్యరశ్మి తగలని చోట ఉంచండి.
మిగిలిన పండ్ల రసం
ఇంట్లో పిండిన పండ్ల రసం మిగిలితే ఫ్రిజ్‌లో పోసేస్తారు చాలా మంది. కానీ ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచితే రసంలోని విటమిన్లు, తాజాదనం పూర్తిగా పోతాయి. తాజా రసమే ఉత్తమం. మిగిలితే ఫ్రిజ్‌కి బదులు ఫ్రీజర్‌లో ఐస్ క్యూబ్స్‌గా పెట్టడం మంచిది.
అల్లం-వెల్లుల్లి పేస్ట్
ఇంట్లో తయారు చేసిన అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుదల జోరుగా సాగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ భారీగా పెరుగుతుంది. తక్కువ మొత్తంలో తయారు చేసుకుని వాడేయడం లేదా ఫ్రీజర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో మాత్రమే పెట్టాలి.
ALSO READ:కుజదోషం ఉంటే హనుమాన్ చాలీసా పఠించాలా? పండితుల అభిప్రాయం ఏమిటి..
మిగిలిన పిండి (రోటీ పిండి)
రోట్టెలు చేసిన తర్వాత మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టడం చాలా పెద్ద తప్పు! చల్లదనంలో పిండి త్వరగా పులిసిపోతుంది. అలాంటి పిండితో చేసిన రోటీలు తింటే గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యలు తప్పవు. పిండిని వెంటనే వాడేయండి లేదా తాజాగానే మళ్లీ కలపండి.
ముక్కలు చేసిన నిమ్మకాయ
నిమ్మకాయను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెడితే కొద్ది గంటల్లోనే ఆక్సీకరణం జరిగి విటమిన్-C పూర్తిగా నాశనమవుతుంది, రుచి కూడా మారిపోతుంది. ఎక్కువ ముక్కలైతే రసం పిండి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేసి ఉపయోగించడం బెస్ట్.మీరు కూడా ఈ 5 వస్తువులను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఇక నుంచి జాగ్రత్త! ఆరోగ్యం ముందు, ఫ్రిజ్ తర్వాత..
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

