Healthhealth tips in telugu

Detox Drink:ఈ డ్రింక్స్ తాగితే ఆరోగ్యం + అందం డబుల్ బోనాంజా! ట్రై చేయకపోతే మీరే లాస్!

Detox Drink:ఈ డ్రింక్స్ తాగితే ఆరోగ్యం + అందం డబుల్ బోనాంజా! ట్రై చేయకపోతే మీరే లాస్.. ఈ రోజుల్లో మనం పీల్చే గాలి నుంచి తినే ఆహారం వరకు ప్రతిదీ కలుషితమవుతోంది. ముఖ్యంగా నగరాల్లో ఉంటేనే కాలుష్యం లెవెల్ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ విషపదార్థాలు శరీరంలోకి చేరి చర్మం మొదలు జీర్ణవ్యవస్థ వరకు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

అయితే భయపడాల్సిన అవసరం లేదు! రోజూ కొన్ని సింపుల్ డిటాక్స్ డ్రింక్స్ తాగితే శరీరం అంతర్గతంగా క్లీన్ అయి, చర్మం కూడా గ్లో అవుతుంది. ఏం తాగాలో ఇప్పుడే చూద్దాం:
ALSO READ:చలికాలంలో జుట్టు ఊడకుండా ఉండాలంటే… ఈ 6 హెర్బల్ ఆయిల్స్ మ్యాజిక్ చేస్తాయి..
నిమ్మ + తేనె గోరువెచ్చని నీళ్లు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే జీర్ణవ్యవస్థ సూపర్ క్లీన్! నిమ్మలోని విటమిన్-C ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది.
పసుపు + అల్లం టీ
పసుపులోని కర్కుమిన్ అదిరిపోయే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. కాలుష్యం వల్ల వచ్చే అలర్జీలు, దగ్గు-జలుబు తగ్గుతాయి. అల్లం జీర్ణశక్తిని బూస్ట్ చేస్తుంది.
ALSO READ:ఫ్రిజ్ శుభ్రంగా ఉన్నా దుర్వాసన వస్తోందా? ఈ ౩ సింపుల్ టిప్స్‌లతో శాశ్వతంగా వదిలించుకోండి..
కీరదోస + పుదీనా నీళ్లు
రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాదు, మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు పంపుతుంది. చర్మం మీద గ్లో కనిపిస్తుందే!
ఆపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్
ఒక గ్లాసు నీళ్లలో 1 టీస్పూన్ ACV కలిపి తాగండి. శరీరం pH బ్యాలెన్స్ అయి, టాక్సిన్స్ త్వరగా బయటకు వెళ్తాయి.
గ్రీన్ టీ
కాటెచిన్స్ అనే అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉండటంతో ఊపిరితిత్తులపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఈ ఐదు డ్రింక్స్‌లో ఏవైనా 2-3 రోజూ తాగితే చాలు — శరీరం లోపల క్లీన్, బయట చర్మం గ్లో!
గమనిక: ఇవన్నీ సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్త డ్రింక్ మొదలుపెట్టే ముందు మీ వైద్యుడిని సంప్రదిం చడం మంచిది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/