Kitchenvantalu

Kitchen Tips:ఇంటి ఇల్లాలుకి ప్రతీరోజూ ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలు..

Kitchen Tips:ఇంటి ఇల్లాలుకి ప్రతీరోజూ ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలు.. కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి, అవి కరిగేంత వరకు బాగా కలపండి. ఇలా చేయడం వల్ల పాత్రకు అంటుకున్న కూర సులువుగా విడిపోతుంది మరియు మళ్లీ అడుగంటకుండా ఉంటుంది.

కిచెన్‌లో నూనె చిమ్మినప్పుడు వెంటనే ఆ ప్రాంతంపై గోధుమపిండి చల్లండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కిచెన్ పేపర్‌తో తుడవండి. నూనె పడిన చోట జిడ్డు లేకుండా పరిశుభ్రంగా అవుతుంది.

వర్షాకాలంలో తేమ వల్ల తలుపులు తెరిచినప్పుడు, మూసినప్పుడు కిర్రుకిర్రు శబ్దాలు వస్తుంటాయి. అలాంటప్పుడు తలుపు బోల్టుల దగ్గర కొద్దిగా టాల్కం పౌడర్ చల్లండి లేదా కొవ్వొత్తిని రుద్దండి. ఈ చిట్కా వల్ల శబ్దాలు పూర్తిగా తగ్గుతాయి.

వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉంచాలంటే… వేడి నీళ్లలో రెండు టేబుల్‌స్పూన్ల వెనిగర్ కలిపి, ఆ నీళ్లలో పండ్లు మరియు కూరగాయలను 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/