Pesarattu premix powder:నిమిషాల్లో వేడి వేడి పెసరట్టు రెడీ.. పప్పు నానబెట్టకుండా… 3 నెలలు నిల్వ ఉండే సూపర్ ప్రీమిక్స్ పౌడర్
Pesarattu premix powder:నిమిషాల్లో వేడి వేడి పెసరట్టు రెడీ! పప్పు నానబెట్టకుండా… 3 నెలలు నిల్వ ఉండే సూపర్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలి?
వర్కింగ్ ఉమెన్, హాస్టల్/రూమ్స్‌లో ఉండే స్టూడెంట్స్ లేదా ఎప్పుడైనా త్వరగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్! ప్రతిసారీ పెసలు నానబెట్టి, రుబ్బే ఇబ్బంది లేకుండా… కేవలం నిమిషాల్లో క్రిస్పీ పెసరట్టు వేసుకోవచ్చు. ఫ్రిజ్ అవసరం లేకుండా గది ఉష్ణోగ్రతలోనే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఇన్స్టంట్ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం, ఉపయోగించే పద్ధతి ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం.
పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్‌కి కావాల్సిన పదార్థాలు:
పెసలు (మినపప్పు / Green Gram) : 4 కప్పులు
బియ్యం (ఏ రకమైనా) : ½ కప్పు
ALSO READ:రాత్రి చేసిన చపాతీలు ఉదయం తినడం మంచిదేనా..
మసాలా దినుసులు:
ఎండు అల్లం (సొంఠి) : 10 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మిరియాలు : ¾ టేబుల్ స్పూన్
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 3-4
కరివేపాకు : ¾ కప్పు (తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి)
ఇంగువ : 1 టీస్పూన్
పసుపు : ¼ టీస్పూన్
ఉప్పు : 1 టీస్పూన్ (లేదా రుచికి తగినంత)
ప్రీమిక్స్ పౌడర్ తయారీ విధానం:
పెసలు, బియ్యాన్ని కలిపి 1-2 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోండి. (నానబెట్టకూడదు, కేవలం ధూళి తొలగించాలి.)కడిగిన మిశ్రమాన్ని జాలి గిన్నెలో వడకట్టి నీరు పూర్తిగా కార్చేయండి.తడి లేకుండా ఒక పొడి కాటన్ గుడ్డపై పల్చగా పరచి, ఎండలో లేదా ఫ్యాన్ కింద రాత్రంతా బాగా ఆరబెట్టండి.పూర్తిగా డ్రై అయిన తర్వాత, పాన్‌లో కొద్దికొద్దిగా వేసి లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాలు వేయించండి (చేత్తో తాకితే వేడి తగిలేలా).
అదే పాన్‌లో సొంఠి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి 2 నిమిషాలు వేయించండి. కరివేపాకును క్రిస్పీ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టండి.సొంఠి ముక్కలను ముందుగా రోల్‌తో కచ్చాపచ్చాగా దంచి, వేయించిన మసాలాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉప్పుతో కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోండి.
ALSO READ:రూ.4,599 విలువ గలది కేవలం రూ.2,599కే.. 43 శాతం తగ్గింపుతో..
వేయించి చల్లారిన పెసలు-బియ్యం మిశ్రమాన్ని మిక్సీ జార్ సగం నిండా వేసుకుని మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.రెండు పొడులను వెడల్పాటి ప్లేట్లో వేసి చేత్తో బాగా కలుపండి. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని గాజు జార్ లేదా డబ్బాలో నిల్వ చేయండి.
ప్రీమిక్స్తో పెసరట్టు ఎలా వేయాలి?
1 కప్పు ప్రీమిక్స్ పౌడర్‌కు 1 కప్పు నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపండి.కనీసం 30 నిమిషాలు (మరింత మెత్తగా కావాలంటే 1-2 గంటలు) నానబెట్టండి.నానాక పిండి చిక్కబడుతుంది కాబట్టి, మరో కొంచెం నీళ్లు & అవసరమైతే ఉప్పు వేసి దోసె పిండి లాగా జారుడుగా కలపండి. పాన్ బాగా వేడెక్కాక లో ఫ్లేమ్‌లో నూనె/నెయ్యి రాసి దోసె వండండి. ఎర్రగా కాలాక అల్లం చట్నీతో సర్వ్ చేయండి.
టిప్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురుమిన క్యారెట్ వేసి ఉతప్పం స్టైల్ ఆనియన్ పెసరట్టు కూడా వేయవచ్చు.. ఈ ప్రీమిక్స్ బిజీ రోజుల్లో టైం సేవ్ చేస్తుంది… హెల్తీ & టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా రెడీ!

