Kitchenvantalu

Kitchen hacks:ఇంటి ఇల్లాలుకి ప్రతీరోజూ ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలు …

Kitchen hacks:ఇంటి ఇల్లాలుకి ప్రతీరోజూ ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలు … వంటింటి పనులు చేసే ఇంటి యజమానులకు రోజూ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వంట సామాను నుంచి డ్రెస్సింగ్ టేబుల్ వరకు ప్రతిదీ పరిశుభ్రంగా, మెరిసేలా ఉంచడం చాలా మందికి తలనొప్పిగా మారుతుంది.

ఎందుకంటే కొన్ని మరకలు, దుమ్ము లేదా దుర్వాసనలు సులభంగా పోవు. అలాంటి సమయాల్లో ఇంట్లోనే ఉండే సాధారణ వస్తువులతో సింపుల్ టిప్స్ ఉపయోగపడతాయి. ఈ కిచెన్ హ్యాక్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి!
ALSO READ:30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసిందా.. ఈ సహజ హోం రెమిడీస్‌ ఫాలో అవ్వండి..
స్టీల్ పాత్రలు మళ్లీ తళతళ మెరవాలంటే…
అయిపోయిన టూత్‌పేస్ట్ ట్యూబ్‌ను కత్తిరించి, లోపల మిగిలిన కొద్దిపాటి పేస్ట్‌ను తీసుకోండి. దాన్ని స్టీల్ పాత్రపై రాసి, పాత టూత్ బ్రష్‌తో బాగా రుద్దండి. కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ రుద్ది, శుభ్రమైన గుడ్డతో తుడవండి. పాత్రలు కొత్తవి లాగా మెరిసిపోతాయి! అదే విధంగా వెండి సామానును కూడా టూత్‌పేస్ట్‌తో రుద్దితే మరకలు పోయి మెరుపు వస్తుంది.

బల్లుల్ని దూరంగా ఉంచే స్ప్రే…
మిరియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలను సమ పాళ్లలో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్‌లో నింపండి. బల్లులు వచ్చే ప్రాంతాల్లో ఈ స్ప్రే చేస్తే, ఘాటైన వాసన వల్ల బల్లులు పరుగెత్తిపోతాయి!

డ్రెస్సింగ్ టేబుల్ అద్దం స్పష్టంగా కనిపించాలంటే…
మిర్రర్ లేదా చిన్న అద్దాలపై దుమ్ము, మరకలు పట్టి సరిగ్గా కనిపించకపోతే – కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి బాగా రుద్దండి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచేస్తే అద్దం తళతళలాడుతూ స్పష్టంగా కనిపిస్తుంది.
ALSO READ:ఏం రాసినా స్కిన్ పొడిగా మారుతుందా.. ఒక స్పూన్ నూనె చాలు..
సింక్‌లో దుర్వాసన పోవాలంటే…
ఒక కప్పు బేకింగ్ సోడాను సింక్‌లో చల్లండి. వెంటనే అర కప్పు వెనిగర్ పోసి కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఈ మిశ్రమం మురికిని తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. చివరగా వేడి నీళ్లతో బాగా కడిగేస్తే సింక్ నుంచి దుర్వాసన పూర్తిగా పోతుంది.
ఈ సులభమైన టిప్స్‌తో మీ ఇంటి పనులు ఇంకా సులువవుతాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/