White Hair:తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం.. డై వద్దు.. ఈ నేచురల్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోండి!
White HAir:తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం.. డై వద్దు.. ఈ నేచురల్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోండి.. ముప్పై ఏళ్లు కూడా నిండకముందే జుట్టు తెల్లబడుతోందని బాధపడుతున్నారా? కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలు నిండిన షాంపూల వల్ల ఈ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది.
అయితే, తెల్ల జుట్టును కవర్ చేయడానికి చాలా మంది కెమికల్ డైలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల జుట్టు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ప్రముఖ న్యాచురోపతిక్ డాక్టర్ శ్రీ సొహమ్ గురూజీ సూచించిన అద్భుతమైన ఇంటి చిట్కాను ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం రెండే రెండు పదార్థాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
స్వచ్ఛమైన కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి (Amla Powder) – 1 టీస్పూన్
ALSO READ:కొబ్బరి నూనె నుండి రోజ్మెరీ వరకు.. మీ జుట్టుకు ఏది బెస్ట్?
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి.అందులో కొబ్బరి నూనె పోసి, వెంటనే ఉసిరి పొడిని కలపండి.ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై మరిగించాలి. నూనె గోల్డెన్ కలర్ లేదా నలుపు రంగులోకి వచ్చేవరకు వేడి చేయాలి.అనంతరం స్టవ్ ఆపేసి, చల్లారాక ఒక కాటన్ గుడ్డతో వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
వాడే విధానం: ఈ నూనెను వాడే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలస్నానం చేయాలి. రాత్రంతా ఉంచుకోవడం ఇష్టం లేనివారు, స్నానానికి కనీసం 2 గంటల ముందు అప్లై చేసుకోవాలి.
ALSO READ:కాటుక ఆకు అద్భుత ప్రయోజనాలు – తెల్లజుట్టు నల్లగా మారుతుంది!
ప్రయోజనాలు:
ఉసిరిలోని విటమిన్ సి, ఐరన్ జుట్టును నల్లగా మార్చడానికి సాయపడతాయి.కొబ్బరి నూనె జుట్టుకు కండిషనింగ్ ఇచ్చి మృదువుగా చేస్తుంది.తలలో రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

