Healthhealth tips in telugu

Weight Loss:14 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన చిట్కా.. వాము, సోంపుతో ఇలా చేస్తే చాలు!

Weight Loss:14 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన చిట్కా.. వాము, సోంపుతో ఇలా చేస్తే చాలు..బరువు తగ్గడం అనేది ఒక రోజులో అయిపోయే పని కాదు. దానికి క్రమశిక్షణ, సరైన ప్రణాళిక అవసరం. ఎంత వ్యాయామం చేసినా, డైట్ చేసినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఫిట్‌నెస్ కోచ్ నేహా పరిహార్ సూచించిన ఈ సింపుల్ డ్రింక్ ట్రై చేయండి. ఆమె స్వయంగా ఈ చిట్కాలు పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు. మరి ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
వాము (Ajwain) – 1 టేబుల్ స్పూన్
సోంపు (Fennel Seeds) – 2 టేబుల్ స్పూన్లు
మెంతులు (Fenugreek Seeds) – 1 టేబుల్ స్పూన్
తురిమిన అల్లం (Grated Ginger) – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 2.5 లీటర్లు
ALSO READ:బిర్యానీ ఆకు నీరు మ్యాజిక్… రోజూ అర గ్లాసు తాగితే…
తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2.5 లీటర్ల నీళ్లు పోసి వేడి చేయండి.నీళ్లు మరుగుతుండగా వాము, సోంపు, మెంతులు వేయండి.మంట తగ్గించి, ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మరిగించండి.చివరిలో తురిమిన అల్లం వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. నీళ్లు చల్లారాక వడకట్టి, ఒక సీసాలో భద్రపరుచుకోండి.

ఎప్పుడు, ఎలా తాగాలి? ఈ డ్రింక్‌ను రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ముఖ్యంగా భోజనానికి అరగంట ముందు లేదా తిన్న అరగంట తర్వాత గోరువెచ్చగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం కాస్త నిమ్మరసం కలుపుకోవచ్చు. 14 రోజుల పాటు ఈ డ్రింక్ తాగితే మార్పు మీకే తెలుస్తుంది.
ALSO READ:ఒక్క కోడిగుడ్డు + వెనిగర్‌తో షుగర్ లెవెల్స్ డౌన్.. నిజం ఎంత..?
లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) రేటు పెరుగుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.శరీరంలోని అనవసరపు కొవ్వు కరుగుతుంది.

ముఖ్య గమనిక: ఇది మ్యాజిక్ డ్రింక్ కాదు. ఇది శరీరానికి సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. దీనితో పాటు జంక్ ఫుడ్ మానేయాలి, స్వీట్స్ తగ్గించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేస్తూ, 7-8 గంటల నిద్రపోతేనే బరువు తగ్గుతారని కోచ్ నేహా స్పష్టం చేశారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."