Beauty Tips

Oil For Hair:కొబ్బరి నూనె నుండి రోజ్‌మెరీ వరకు.. మీ జుట్టుకు ఏది బెస్ట్?

Oil For Hair:కొబ్బరి నూనె నుండి రోజ్‌మెరీ వరకు.. మీ జుట్టుకు ఏది బెస్ట్… ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అయితే మార్కెట్లో దొరికే రకరకాల నూనెలలో ఏది వాడితే మంచి ఫలితం ఉంటుందో చాలా మందికి తెలియదు. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక రెడ్డి విలువైన సూచనలు చేశారు. ఏ సమస్యకు ఏ నూనె వాడాలో ఆమె వివరించారు.

1. కొబ్బరి నూనె (Coconut Oil): పిల్లలకు మరియు జుట్టుకు మంచి కండిషనింగ్ కావాలనుకునేవారికి కొబ్బరి నూనె బెస్ట్ ఛాయిస్. రసాయనాలు లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తలస్నానానికి 30 నుండి 60 నిమిషాల ముందు పట్టించాలి.

గమనిక: మీకు చుండ్రు సమస్య ఉన్నా, లేదా జిడ్డు చర్మం (Oily Scalp) ఉన్నా రాత్రంతా నూనెను తలపై ఉంచుకోకూడదని డాక్టర్ సూచించారు.

2. బాదం నూనె (Almond Oil): జుట్టు పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తోందా? అయితే బాదం నూనె వాడండి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. తలస్నానానికి రెండు గంటల ముందు దీనిని రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు దీనిని ఫేషియల్ ఆయిల్‌గా కూడా వాడుకోవచ్చు.
ALSO READ:కాటుక ఆకు అద్భుత ప్రయోజనాలు – తెల్లజుట్టు నల్లగా మారుతుంది!
3. ఆర్గాన్ ఆయిల్ (Argan Oil): ఇది జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎండ దెబ్బ నుండి జుట్టును కాపాడుతుంది. తలస్నానం చేశాక, తడి జుట్టుపై 2-3 చుక్కలు రాస్తే సిల్కీగా మారుతుంది, చిక్కులు పడవు.

4. రోజ్‌మెరీ ఆయిల్ (Rosemary Oil): జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే రోజ్‌మెరీ ఆయిల్ మంచి పరిష్కారం. ఇది రక్త ప్రసరణను పెంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిని నేరుగా కాకుండా, వేరే నూనెతో (Carrier Oil) కలిపి వారానికి 2-3 సార్లు వాడాలి.
ALSO READ:చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యకు సహజ చిట్కా.. ఈ సింపుల్ మెథడ్ ట్రై చేయండి!
5. జోజోబా ఆయిల్ (Jojoba Oil): మన తలలో సహజంగా ఉండే నూనె (Sebum) లక్షణాలే ఇందులో ఉంటాయి. తల మరీ పొడిబారిపోయిన వారికి ఇది బాగా సెట్ అవుతుంది. తలస్నానానికి ముందు దీనిని వాడితే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది.

6. భృంగరాజ్ ఆయిల్ (Bhringraj Oil): ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనెతో తలకు మసాజ్ చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది. అయితే మరీ గట్టిగా రుద్దకుండా, సున్నితంగా మసాజ్ చేయాలి. లేదంటే జుట్టు తెగిపోయే ప్రమాదం ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/