అన్నం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
అన్నం తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.. భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగేయడం చాలామందికి అలవాటు. నీళ్లు తాగకపోతే తిన్నట్టు ఉండదు అని అంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగడం అంటే విషంతో సమానం అని చెబుతున్నారు.
అసలు లోపల ఏం జరుగుతుంది? మనం ఆహారం తీసుకోగానే దాన్ని అరిగించడానికి పొట్టలో ‘జఠరాగ్ని’ (Digestive Fire) మొదలవుతుంది. జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్ విడుదలవుతాయి. ఆ సమయంలో మీరు వెంటనే నీళ్లు తాగేస్తే.. ఆ యాసిడ్స్ పల్చబడిపోతాయి (Dilute). దీంతో మంట ఆరిపోతుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా అరగదు.
ALSO READ:చల్లారిన టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు విషం తాగుతున్నట్టే.. ఎందుకో చూడండి!
దీని వల్ల వచ్చే సమస్యలు:
గ్యాస్ & అజీర్ణం: ఆహారం అరగక పొట్టలోనే కుళ్ళిపోయి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
బరువు పెరగడం: తిన్న ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా మారుతుంది. దీనివల్ల పొట్ట (Belly Fat) వస్తుంది.
షుగర్ లెవెల్స్: రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.
ఎప్పుడు తాగాలి? భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగొచ్చు. తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి గంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

