ప్రతి నెలా కరెంట్ బిల్లు షాక్ కొడుతోందా? మీ ఇంట్లో ఈ ‘దొంగ’ ఉన్నాడేమో చూసుకోండి.. బిల్లు సగం తగ్గుతుంది!
ప్రతి నెలా కరెంట్ బిల్లు షాక్ కొడుతోందా? మీ ఇంట్లో ఈ ‘దొంగ’ ఉన్నాడేమో చూసుకోండి.. బిల్లు సగం తగ్గుతుంది.. ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేసినా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే మీ ఇంట్లో ‘వాంపైర్ పవర్’ (Vampire Power) సమస్య ఉండవచ్చు. అంటే మనం వాడకపోయినా కొన్ని పరికరాలు విద్యుత్ ను తాగుతూనే ఉంటాయి.
ఏంటి ఆ తప్పు? చాలామంది టీవీ, కంప్యూటర్, లేదా మైక్రోవేవ్ ఓవెన్ వాడకం అయిపోయాక రిమోట్‌తో ఆఫ్ చేస్తారు తప్ప, స్విచ్ బోర్డు దగ్గర మెయిన్ స్విచ్ ఆఫ్ చేయరు. ప్లగ్ సాకెట్లో పెట్టి ఉంచడం వల్ల, ఆ పరికరాలు ‘స్టాండ్‌బై మోడ్’లో ఉండి కరెంట్‌ను లాగుతూనే ఉంటాయి.
పరిష్కారం:
టీవీ, సెటప్ బాక్స్, వాషింగ్ మెషీన్ పని పూర్తవ్వగానే ప్లగ్ తీసేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.పాత ఫ్రిజ్‌ల ప్లేస్‌లో కొత్త ‘స్టార్ రేటెడ్’ ఫ్రిజ్‌లు వాడండి.ఈ చిన్న మార్పుతో నెలకు కనీసం 10-15% బిల్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

