Healthhealth tips in telugu

Home Remedies:రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలల్లో ఇవి వేసుకుని తాగితే.. కీళ్ల నొప్పులు, రక్తహీనత మాయం!

Home Remedies:రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలల్లో ఇవి వేసుకుని తాగితే.. కీళ్ల నొప్పులు, రక్తహీనత మాయం.. ప్రస్తుత జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలామంది అలసట, కీళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులు, మన వంటింట్లో ఉండే చిన్న చిట్కాలతో ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.కీళ్ల నొప్పులు, శారీరక బలహీనతను తరిమికొట్టే ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారీ విధానం ఇదే (How to Prepare): ఈ రెమిడీ కోసం మీకు కావాల్సింది కేవలం పాలు మరియు కిస్మిస్ (ఎండు ద్రాక్ష).
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోయాలి.పాలు కాస్త వేడి అయ్యాక, అందులో ఒక 6 కిస్మిస్ పండ్లను వేయాలి.వీటిని సుమారు 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మరిగించాలి.అనంతరం ఆ పాలను గ్లాసులోకి తీసుకుని, అందులో ఉడికించిన కిస్మిస్ లను తింటూ.. పాలను తాగాలి.

ఎప్పుడు తీసుకోవాలి? ఈ పాలను రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. కానీ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 10 రోజుల పాటు చేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు.

దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
కీళ్ల నొప్పులు మాయం: పాలలో కిస్మిస్ ఉడికించడం వల్ల పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

రక్తహీనతకు చెక్: కిస్మిస్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు ఈ పాలను తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు (Blood Pressure)ను నియంత్రణలో ఉంచుతుంది. హై బీపీ, లో బీపీ సమస్యలను సరిచేసి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.

ఎనర్జీ బూస్టర్: శారీరక బలహీనత, అలసట, నిస్సత్తువతో బాధపడేవారు ఈ పాలు తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

చిన్న చిన్న సమస్యలకు మందులు వాడే బదులు, ఈ సహజసిద్ధమైన చిట్కాను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/