Weight Loss:వేలాడే పొట్ట, నడుము కొవ్వు కరగాలా? ఈ ‘న్యాచురల్ డ్రింక్’తో 5 రోజుల్లోనే మార్పు గమనించండి!
Weight Loss:వేలాడే పొట్ట, నడుము కొవ్వు కరగాలా? ఈ ‘న్యాచురల్ డ్రింక్’తో 5 రోజుల్లోనే మార్పు గమనించండి.. ప్రస్తుత బిజీ లైఫ్స్టైల్లో బరువు పెరగడం చాలా ఈజీగా జరిగిపోతుంది.. కానీ ఆ పెరిగిన బరువు తగ్గడమే పెద్ద టాస్క్! బరువు తగ్గడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే రిజల్ట్ తాత్కాలికమే కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
నిజానికి, పేరుకుపోయిన కొవ్వు ఒక్క రాత్రిలోనో లేదా కేవలం ఐదు రోజుల్లోనో పూర్తిగా మాయం కాదు. కానీ, మీరు తీసుకునే మంచి పోషకాహారం, కొద్దిపాటి వ్యాయామానికి ఈ ‘న్యాచురల్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్’ తోడైతే.. మీ శరీరంలో కొవ్వు కరిగే ప్రాసెస్ (Metabolism) విపరీతంగా పెరిగి, చాలా త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆ ఇంటి చిట్కా ఏంటో ఇక్కడ చూద్దాం.
డ్రింక్ తయారీకి కావాల్సినవి:
ఒక గ్లాసు నీళ్లు
సగం నిమ్మకాయ (ముక్కలుగా కోసింది)
చిన్న అల్లం ముక్క (దంచినది లేదా ముక్కలు చేసినది)
అర స్పూన్ స్వచ్ఛమైన తేనె
ఎలా తయారు చేయాలి?
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి.ఆ నీటిలో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేయాలి.కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల నిమ్మ, అల్లంలోని ఔషధ గుణాలు నీటిలోకి చేరతాయి.
ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఆ నీటిని ఒక గ్లాస్‌లోకి వడకట్టుకోవాలి.నీళ్లు కాస్త గోరువెచ్చగా (Warm) అయ్యాక, అందులో అర స్పూన్ తేనె కలుపుకుంటే మీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెడీ!
ఈ డ్రింక్ ఎప్పుడు, ఎలా తాగాలి?
దీన్ని తాగడానికి ఒక పద్ధతి ఉంది. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది.
ఎప్పుడు తాగాలి: మధ్యాహ్నం లంచ్ చేయడానికి, రాత్రి డిన్నర్ చేయడానికి కరెక్ట్‌గా అరగంట ముందు ఈ గోరువెచ్చని డ్రింక్ తాగాలి.
ఎలా పనిచేస్తుంది: ఇలా భోజనానికి ముందు తాగడం వల్ల మీరు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అల్లం, నిమ్మకాయలోని పోషకాలు పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును మైనంలా కరిగించడానికి సహాయపడతాయి.
రూల్: ఈ డ్రింక్‌ను వరుసగా 5 రోజులు తాగాలి. ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 5 రోజులు తాగాలి.
ఇలా క్రమం తప్పకుండా 2 నెలల పాటు చేస్తూ, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మీ బరువులో ఆశ్చర్యపోయే మార్పు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే స్టార్ట్ చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

