Joint Pains:కేవలం 7 రోజులు.. ఈ పాలు తాగారంటే కీళ్ల నొప్పులు, చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి మాయం..
Joint Pains:కేవలం 7 రోజులు.. ఈ పాలు తాగారంటే కీళ్ల నొప్పులు, చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి మాయం..మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, నిద్రలేమి వంటివి ఎంతో మందిని వేధిస్తున్నాయి. చిన్న సమస్య రాగానే మందుల మీద ఆధారపడకుండా, మన వంటగదిలోని సహజ సిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
కేవలం 3 పదార్థాలతో తయారుచేసే ఈ ‘స్పెషల్ పాలు’ వరుసగా 7 రోజుల పాటు తాగితే.. వందేళ్లయినా నరాల బలహీనత, కీళ్ల నొప్పులు మీ దరిచేరవు. మరి ఈ పాలను ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
పాలు: 1 గ్లాసు
వాల్ నట్స్ (Walnuts): 3
డ్రై నల్ల ద్రాక్ష (Black Raisins): 5
బెల్లం: కొద్దిగా
తయారీ విధానం ఎంతో సులువు:
రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో 3 వాల్ నట్స్, 5 డ్రై నల్ల ద్రాక్షలను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయం నానిన వాల్ నట్స్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి, గిన్నెలో ఒక గ్లాసు పాలు పోసి వేడి చేయాలి.
పాలు కాస్త వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్ నట్స్ ముక్కలు, నానబెట్టిన నల్ల ద్రాక్ష వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి.పాలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసి, మరో నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఆరోగ్యకరమైన పాలు రెడీ!
ఎలా తాగాలి?
ఈ పాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు లేదా సాయంత్రం సమయంలో గోరువెచ్చగా తాగవచ్చు.ఇలా వరుసగా 7 రోజుల పాటు తాగాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మరో వారం రోజుల పాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ పాలు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు:
నొప్పులు పరార్: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పితో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. కాల్షియం లోపం దరిచేరదు.
గుండె భద్రం: శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
నిద్రలేమికి చెక్: రాత్రిళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడేవారు ఈ పాలు తాగితే ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జబ్బుల నుంచి శరీరం రక్షించబడుతుంది. రక్తహీనత, నరాల బలహీనత కూడా తగ్గుతాయి.
గమనిక: ఇంట్లో చేసుకోగలిగే ఈ చిట్కా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ఈ రెమిడీ ఫాలో అవ్వడం మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

