Joint Pains:ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ 3 పదార్థాలు కలిపి తింటే.. మీ ఒంట్లో నొప్పులన్నీ పరార్!
Joint Pains:ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ 3 పదార్థాలు కలిపి తింటే.. మీ ఒంట్లో నొప్పులన్నీ పరార్.. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, సరైన పోషకాలు లేని ఆహారం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల.. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఊబకాయం, రక్తహీనత, తీవ్రమైన అలసట వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
మరి ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ, రోజంతా యాక్టివ్‌గా ఉంచే అద్భుతమైన, చౌకైన ఇంటి చిట్కా ఒకటుంది. అదే ‘అటుకుల పాయసం’.ఇంట్లో సులభంగా దొరికే పాలు, అటుకులు, బెల్లంతో చేసే ఈ పాయసం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది.
తయారీకి కావాల్సినవి:
ఒక గ్లాసు పాలు
3 టీస్పూన్ల అటుకులు
రుచికి సరిపడా బెల్లం
ఎలా తయారు చేయాలి?
ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు పాలు పోసి వేడి చేయాలి.పాలు కొద్దిగా వేడెక్కాక, 3 స్పూన్ల అటుకులు వేసి బాగా ఉడికించాలి.అటుకులు మెత్తబడ్డాక, రుచికి సరిపడా బెల్లం వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.అంతే.. కమ్మని, ఆరోగ్యకరమైన అటుకుల పాయసం రెడీ!
ఎలా, ఎప్పుడు తీసుకోవాలి?
ఈ పాయసాన్ని వారంలో కనీసం రెండు సార్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కానీ, సాయంత్రం సమయంలో స్నాక్‌లా కానీ తీసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.
ఈ 3 గింజల పొడిని రోజుకు ఒక్క స్పూన్ తింటే చాలు.. 80 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడతారు!.. కింద ఉన్న వీడియో ని చూడండి
దీనివల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
కీళ్ల నొప్పులకు చెక్: పాలు, అటుకులలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
రక్తహీనత దూరం: బెల్లం, అటుకులలో ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను దరిచేరనివ్వదు.
బలహీనత, అలసట మాయం: పాలు, బెల్లం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. శారీరక బలహీనత, నీరసం తగ్గిపోయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
బరువు నియంత్రణ: అటుకులలో పీచుపదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా అధిక బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.
గమనిక: మంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

