Summer AC Tips:ఉక్కపోతతో ఏసీ ఆన్ చేస్తున్నారా? ఈ చిన్న పనులు చేస్తే కరెంట్ బిల్లు సగానికి సగం ఆదా అవుతుంది!
Summer AC Tips:ఉక్కపోతతో ఏసీ ఆన్ చేస్తున్నారా? ఈ చిన్న పనులు చేస్తే కరెంట్ బిల్లు సగానికి సగం ఆదా అవుతుంది..మార్చి రాకముందే ఎండలు మండి పోతున్నాయి. ఇంట్లో ఉన్నా ఫ్యాన్ గాలి అస్సలు సరిపోవడం లేదు. దీంతో ఉక్కపోత భరించలేక చాలామంది చలికాలం అంతా పక్కనపెట్టిన ఏసీలను (AC) ఇప్పుడు ఆన్ చేస్తున్నారు.
అయితే ఒక్క నిమిషం! నెలల తరబడి వాడకుండా వదిలేసిన ఏసీని డైరెక్ట్‌గా ఆన్ చేస్తే కరెంట్ బిల్లులు షాక్ కొట్టడమే కాకుండా.. దాని నుంచి వచ్చే దుమ్ము వల్ల మీ ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్విచ్ వేసే ముందు కచ్చితంగా ఈ కింది పనులు చేస్తే.. ఏసీ సూపర్ కూలింగ్ ఇవ్వడమే కాకుండా పవర్ బిల్ కూడా ఆదా అవుతుంది.
ఏసీ ఆన్ చేసే ముందు చేయాల్సిన 6 పనులు:
1. ఫిల్టర్ల క్లీనింగ్ మస్ట్ (Air Filters): నెలల తరబడి వాడకపోవడం వల్ల ఫిల్టర్లలో విపరీతమైన దుమ్ము పేరుకుపోతుంది. ఆ దుమ్ముతోనే ఏసీ ఆన్ చేస్తే.. గాలి సరిగ్గా రాక కంప్రెసర్‌పై భారం పడుతుంది. అందుకే ఏసీ పైకవర్ ఓపెన్ చేసి ఫిల్టర్లను తీసి, గోరువెచ్చని నీటితో కడిగి ఆరబెట్టాకే వాడండి.
2. ఔట్‌డోర్ యూనిట్ చెకింగ్: ఆరుబయట ఉండే కంప్రెసర్ యూనిట్ చుట్టూ చెత్త, పక్షుల గూళ్లు, ఆకులు లేకుండా చూసుకోండి. దాని చుట్టూ కనీసం రెండు అడుగుల ఖాళీ ఉంటే.. వేడి గాలి సులభంగా బయటకు వెళ్లి, మీ రూమ్ త్వరగా కూల్ అవుతుంది.
3. వాటర్ పైపులో బ్లాక్స్ (Drain Pipe): ఏసీ నుంచి నీరు బయటకు వెళ్లే పైపులో పాచి లేదా దుమ్ము ఉందేమో చెక్ చేయండి. లేదంటే ఆ నీరు బయటకు వెళ్లలేక, తిరిగి వెనక్కి తన్ని మీ గది గోడలు, ఏసీ సర్క్యూట్ పాడయ్యే ప్రమాదం ఉంది.
4. కూలింగ్ కాయిల్స్ (Coils): ఇండోర్, ఔట్‌డోర్ కాయిల్స్ శుభ్రంగా ఉంటేనే కూలింగ్ ఫాస్ట్‌గా వస్తుంది. వాటిపై దుమ్ము ఎక్కువగా పేరుకుపోయి ఉంటే ప్రొఫెషనల్ టెక్నీషియన్‌ను పిలిచి సర్వీసింగ్ చేయించడం బెస్ట్.
5. కూలింగ్ లీక్ అవ్వకుండా చూడండి: ఏసీ ఆన్ చేసే ముందు కిటికీలు, తలుపులు సరిగ్గా క్లోజ్ అయ్యాయో లేదో చూడండి. ముఖ్యంగా తలుపుల కింద ఉండే ఖాళీలను (Door gaps) మ్యాట్స్ లేదా డోర్ సీలర్లతో కవర్ చేస్తే చల్లటి గాలి బయటకు పోదు.
6. స్టెబిలైజర్ ఉందా? (Stabilizer): వేసవిలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు కామన్. కాబట్టి ఏసీకి స్టెబిలైజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందే చెక్ చేసుకోండి. ఇది లక్షలు పెట్టి కొన్న మీ ఏసీ కంప్రెసర్ పాడవకుండా కాపాడుతుంది.
ప్రో టిప్: కరెంట్ బిల్లు తగ్గాలంటే..
ఏసీ ఆన్ చేయగానే రూమ్ త్వరగా చల్లబడాలని చాలామంది 16°C లేదా 18°C లో పెడుతుంటాం. దీనివల్ల కంప్రెసర్‌పై విపరీతమైన లోడ్ పడి విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఏసీని ఎప్పుడూ 24°C – 26°C మధ్య ఉంచండి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది.. జేబుకీ మంచిది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

