Business

Health Insurance:ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? ‘ఇండివిడ్యువల్’ vs ‘ఫ్యామిలీ ఫ్లోటర్’.. మీ కుటుంబానికి ఏది బెస్ట్?

Health Insurance:ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? ‘ఇండివిడ్యువల్’ vs ‘ఫ్యామిలీ ఫ్లోటర్’.. మీ కుటుంబానికి ఏది బెస్ట్..హాస్పిటల్స్ లో వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) ఉండటం అత్యవసరం. అయితే, పాలసీ తీసుకునేటప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం.. ‘వ్యక్తిగత పాలసీ (Individual)’ తీసుకోవాలా? లేక కుటుంబం మొత్తానికి కలిపి ‘ఫ్యామిలీ ఫ్లోటర్ (Family Floater)’ తీసుకోవాలా? అని.

ఏజెంట్లు చెప్పింది గుడ్డిగా నమ్మేసి, తీరా అవసరం వచ్చినప్పుడు కవరేజ్ సరిపోక ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఈ రెండు పాలసీల మధ్య ఉన్న తేడాలు, మీకు ఏది సెట్ అవుతుందో ఇక్కడ సింపుల్ గా తెలుసుకోండి.

ఇండివిడ్యువల్ (వ్యక్తిగత) పాలసీ అంటే ఏంటి?
ఈ పాలసీ కింద ఎవరి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటే, వారికి మాత్రమే కవరేజ్ లభిస్తుంది.

మీ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు తలా రూ.10 లక్షల ఇండివిడ్యువల్ పాలసీలు తీసుకుంటే.. ఎవరికి అనారోగ్యం వచ్చినా, వారికి విడిగా రూ.10 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఒకరి కవరేజ్‌తో మరొకరికి సంబంధం ఉండదు.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటే ఏంటి?
కుటుంబ సభ్యులందరికీ (భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు) కలిపి ఒకే పాలసీ తీసుకుంటే దానినే ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు.

ఉదాహరణకు, నలుగురు ఉన్న మీ కుటుంబం రూ.10 లక్షల కవరేజీకి ఫ్లోటర్ పాలసీ తీసుకుందనుకుందాం. అందులో ఒకరికి జబ్బు చేసి రూ.6 లక్షలు ఖర్చయితే, ఆ ఏడాదికి మిగిలిన ముగ్గురికి కేవలం రూ.4 లక్షల కవరేజ్ మాత్రమే మిగులుతుంది.

ఎవరికి ఏ పాలసీ సెట్ అవుతుంది?
యువ కుటుంబాలకు ‘ఫ్లోటర్’ బెస్ట్: * 30 ఏళ్ల లోపు దంపతులు, 18 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది కరెక్ట్ ఆప్షన్. వీరికి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి, ఇండివిడ్యువల్ పాలసీల కంటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారు 35% నుండి 60% వరకు ఆదా అవుతుంది.పైగా ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలకు విడిగా వ్యక్తిగత పాలసీలు ఇవ్వరు. కాబట్టి వీరు ఫ్యామిలీ ఫ్లోటర్ వైపే వెళ్లాలి.

పెద్ద వయసు వారికి ‘ఇండివిడ్యువల్’ బెస్ట్:
మీ కుటుంబంలో 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు ఉన్నా, లేదా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఉన్నా.. వారి కోసం ప్రత్యేకంగా ‘ఇండివిడ్యువల్ పాలసీ’ తీసుకోవడమే సురక్షితం.

ముఖ్య గమనిక: ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో కుటుంబంలో అత్యధిక వయసు ఉన్న వ్యక్తి వయసు ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తారు. వయసు పెరిగే కొద్దీ ప్రతి ఏటా ప్రీమియం భారం పెరుగుతూనే ఉంటుంది.

చివరి మాట: మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయసు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు మీ బడ్జెట్‌ను బేరీజు వేసుకుని పాలసీని ఎంచుకోండి. అవసరమైతే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బీమా సలహాదారులను సంప్రదించడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."