Hair care Tips:వారంలో 2 సార్లు ఇది రాస్తే.. జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరుగుతుంది!
Hair care Tips:వారంలో 2 సార్లు ఇది రాస్తే.. జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య.. జుట్టు రాలిపోవడం. దువ్వెన పట్టుకుంటే చాలు గుప్పెడు జుట్టు ఊడిపోతోందని కంగారు పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
జుట్టు రాలడం మొదలవ్వగానే.. మనలో చాలామంది టీవీల్లో, ఆన్‌లైన్‌లో కనిపించే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ కొనేస్తుంటారు. వీటి వల్ల జుట్టు పెరగకపోగా, లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ముందుగా ‘జుట్టు కుదుళ్లు’ బలంగా ఉండాలి. పోషకాహారం తీసుకుంటూనే, ఇంట్లోనే లభించే వస్తువులతో ఒక అద్భుతమైన ‘హెయిర్ గ్రోత్ సీరమ్’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు ఇవే:
కలోంజి గింజల పొడి (Nigella Seeds): 3 స్పూన్లు
నీళ్లు: 1 గ్లాసు
అలోవెరా జెల్: 3 స్పూన్లు
రోజ్ వాటర్: 1 స్పూన్
పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్: 4 చుక్కలు
మ్యాజిక్ సీరమ్ తయారీ విధానం:
ముందుగా కలోంజి (నల్ల జీలకర్ర లాగా ఉండే) గింజలను మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడి చేయాలి.నీళ్లు కాస్త వేడెక్కాక, అందులో 3 స్పూన్ల కలోంజి పొడి వేసి బాగా మరిగించాలి.గ్లాసు నీళ్లు కాస్తా సగం అయ్యే వరకు మరిగించి, ఆ తర్వాత స్టవ్ ఆపి నీటిని వడగట్టుకోవాలి.
ఈ కలోంజి డికాషన్ పూర్తిగా చల్లారాక.. అందులో 3 స్పూన్ల అలోవెరా జెల్, 1 స్పూన్ రోజ్ వాటర్, 4 చుక్కల పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుంటే.. మీ మ్యాజిక్ హెయిర్ సీరమ్ రెడీ!
ఎలా వాడాలి?
ఈ సీరమ్‌ను తలస్నానం చేయడానికి ఒక గంట ముందు జుట్టు కుదుళ్లలోకి బాగా వెళ్లేలా స్ప్రే చేయాలి. ఆ తర్వాత చేతివేళ్లతో ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. సరిగ్గా గంట తర్వాత కుంకుడుకాయలతో (లేదా ఏదైనా మైల్డ్ షాంపూతో) తలస్నానం చేయాలి.
ఫలితం ఎలా ఉంటుంది?
ఇలా వారంలో కేవలం రెండు సార్లు చేస్తే చాలు. కలోంజిలోని పోషకాలు జుట్టు కుదుళ్లను ఇనుములా బలంగా మారుస్తాయి. దీనివల్ల కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోయి.. వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరగడం మీరే గమనిస్తారు.
ఇంకెందుకు ఆలస్యం? వేలకు వేలు ఖర్చుపెట్టే బదులు, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ న్యాచురల్ సీరమ్‌ను ఈ రోజే ట్రై చేసి చూడండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

