Child Welfare:రాత పరీక్ష లేదు.. నెలకు రూ.34 వేల జీతం.. ఏపీ మహిళలకు పండగలాంటి వార్త..
Child Welfare:రాత పరీక్ష లేదు.. నెలకు రూ.34 వేల జీతం.. ఏపీ మహిళలకు పండగలాంటి వార్త.. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ద్వారా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా నడుస్తున్న ‘వన్ స్టాప్ సెంటర్’లో ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండి, సొంత జిల్లాలోనే మంచి జీతంతో ఉద్యోగం సాధించాలనుకునే మహిళలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు (మొత్తం 13 ఖాళీలు):
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 1
సైకో సోషల్ కౌన్సిలర్ – 1
కేస్ వర్కర్లు – 2
పారా లీగల్ పర్సనల్ (లాయర్) – 1
పారా మెడికల్ పర్సనల్ – 1
ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి) – 1
సెక్యూరిటీ గార్డులు – 3
మల్టీపర్పస్ స్టాఫ్ – 3
అర్హతలు,వయోపరిమితి:
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ పాసై ఉండాలి. (లా, సోషల్ వర్క్, సైకాలజీ చదివిన వారికి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు).
వయస్సు: 2026 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం & ఎంపిక విధానం:
జీతం: ఎంపికైన అభ్యర్థులకు వారు చేసే పోస్టును బట్టి నెలకు కనిష్టంగా రూ. 13,000 నుంచి గరిష్టంగా రూ. 34,000 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక: ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలంటే..
ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో (డైరెక్ట్‌గా వెళ్లి) దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌ను శ్రీకాకుళంలోని ‘జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి’ కార్యాలయంలో అందజేయాలి.
చివరి తేదీ: 2026 మార్చి 13.
అధికారిక వెబ్సైట్: https://srikakulam.ap.gov.in/
గడువు చాలా తక్కువగా ఉంది కాబట్టి అర్హత ఉన్న మహిళలు వెంటనే సంబంధిత కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

