Airtel Broadband Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: ఈ ఒక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ సహా 22 OTTలు ఫ్రీ!
Airtel Broadband Plan : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్: ఈ ఒక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ సహా 22 OTTలు ఫ్రీ.. ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండి విసిగిపోయారా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.. వీకెండ్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎంజాయ్ చేసేవాళ్ల కోసం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) ఒక అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.
కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, క్రియేటర్లకు ఉపయోగపడే అడోబ్ యాప్స్ కూడా ఈ ప్లాన్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ హైలైట్స్ ఇవే:
హై-స్పీడ్ ఇంటర్నెట్: ఈ ప్లాన్ ద్వారా 100Mbps స్పీడ్ లభిస్తుంది. ఇంట్లో ఒకేసారి మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీ కనెక్ట్ చేసినా బఫరింగ్ లేకుండా 4K వీడియోలు చూసేయొచ్చు. ఆన్‌లైన్ గేమింగ్‌కు కూడా ఇది పర్ఫెక్ట్.
డేటాకు డోకా లేదు: నెలకు ఏకంగా 3300GB (3.3TB) డేటా వస్తుంది. సగటున ఒక కుటుంబానికి నెల మొత్తం వాడుకున్నా ఈ డేటా మిగిలిపోతుంది.
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఉచితం: ఈ ప్లాన్ తీసుకున్న వారికి Netflix, Amazon Prime Video సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. వీటికి విడిగా డబ్బులు కట్టాల్సిన పనే లేదు.
మరో 22 ఓటీటీలు కూడా: కేవలం ఆ రెండే కాదు.. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ (Airtel Xstream) ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 లాంటి మరో 22 ప్రముఖ ఓటీటీ యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు. ఇంటర్నెట్, లైవ్ టీవీ రెండూ ఒకే బిల్లులో కవర్ అయిపోతాయి.
క్రియేటర్లకు స్పెషల్ గిఫ్ట్:
ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వీడియో ఎడిటర్ల కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తోంది.
Adobe Express Premium: వేల రూపాయల విలువ చేసే అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంకు ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా వీడియోలు, రీల్స్‌ను ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు.
Google One: డేటా దాచుకోవడానికి గూగుల్ వన్ 6 నెలల పాటు ఫ్రీ ట్రయల్ ఇస్తోంది. (ఆరు నెలల తర్వాత వాడాలనుకుంటే నెలకు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది).
గతంలో ఈ రూ.999 ప్లాన్ పై 200Mbps స్పీడ్ వచ్చేది. దాన్ని ఇప్పుడు 100Mbps కు కంపెనీ కొద్దిగా తగ్గించినప్పటికీ.. ఉచితంగా ఇస్తున్న నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, అడోబ్ లాంటి ప్రీమియం బెనిఫిట్స్ చూసుకుంటే ఇది బెస్ట్ డీల్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరి మీ ఇంటర్నెట్ అవసరాలకు ఈ ప్లాన్ సెట్ అవుతుందేమో చెక్ చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

