Tirumala Tirupati:తిరుమలలో బర్త్‌డే కేక్ కట్ చేయకూడదా? శ్రీవారి భక్తులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన TTD కఠిన నిబంధనలు ఇవే!
Tirumala Tirupati:తిరుమలలో బర్త్‌డే కేక్ కట్ చేయకూడదా? శ్రీవారి భక్తులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన TTD కఠిన నిబంధనలు ఇవే.. కలియుగ వైకుంఠం తిరుమల గిరులు ఎప్పుడూ గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
అయితే, ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ (TTD) విధించిన కొన్ని కఠిన నిబంధనలు చాలామందికి తెలియదు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో తిరుమలలోని నియమ నిబంధనల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
అసలు వివాదం ఏంటి? బర్త్ డే వేడుకలు జరుపుకోవచ్చా?
ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి బృందం తిరుమలలోని ఓ అతిథిగృహంలో (శ్రీవిభవ) బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా ‘కేక్’ కట్ చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. తిరుమల కొండపైకి కేక్ తీసుకురావడం, అక్కడ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం టీటీడీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. దీనిపై ఆలయ అధికారులు సీరియస్‌గా విచారణ జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో, తిరుమలకు వెళ్లే భక్తులు ఏయే పనులు చేయకూడదో, టీటీడీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం..
కొండపై ఇవి పూర్తిగా నిషేధం!
రీల్స్, డ్యాన్సులు వద్దు: సోషల్ మీడియా పిచ్చితో కొందరు మాడ వీధుల్లో, ఆలయ ప్రాంగణంలో డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
వ్యసనాలకు దూరం: తిరుమల కొండపై ధూమపానం, మద్యం సేవించడం, మాంసాహారం తినడం, పేకాట లాంటి జూదాలు ఆడటం పూర్తిగా నేరం.
ఆ ప్రచారాలు బ్యాన్: కొండపై ఇతర మతాల ప్రచారం గానీ, రాజకీయ కార్యకలాపాలు (జెండాలు, నినాదాలు) గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
చెప్పులు లేకుండానే: శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లో భక్తులు ఎవరూ చెప్పులు ధరించకూడదు.
ప్లాస్టిక్ నో: కొండపైకి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ తీసుకువెళ్లడం నిషేధం.
ఆయుధాలు తెస్తున్నారా?: లైసెన్స్ ఉన్న ఆయుధాలు అయినా సరే అలిపిరి చెక్‌పోస్ట్ వద్దే అధికారులకు అప్పగించాలి. దాచిపెట్టి తీసుకెళితే చట్టపరమైన చర్యలు తప్పవు. సెల్‌ఫోన్లు, కెమెరాలు ఆలయంలోకి అనుమతించరు.
డ్రెస్ కోడ్.. పద్ధతులు ఎలా ఉండాలి?
పురుషులు: ధోవతి-ఉత్తరీయం లేదా కుర్తా-పైజామా ధరించాలి.
మహిళలు: చీర-రవిక, లంగా-ఓణి, చుడీదార్ లేదా పంజాబీ డ్రస్ మాత్రమే వేసుకోవాలి. ట్రెండీ దుస్తులు వేసుకుంటే దర్శనానికి అనుమతించరు.
స్వామివారికి సమర్పించే కానుకలు (డబ్బు, నగలు) నేరుగా హుండీలోనే వేయాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.
సాంప్రదాయం ప్రకారం.. ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. క్యూ లైన్లలో ఓపికగా “ఓం నమో వెంకటేశాయ” అని స్మరించుకుంటూ ముందుకు సాగాలి.
తిరుమల ఒక పుణ్యక్షేత్రం, పిక్నిక్ స్పాట్ కాదు. ఆలయ పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి కనీస బాధ్యత!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

