Dandruff:చుండ్రు, జుట్టు రాలే సమస్యతో విసిగిపోయారా? ఈ ఒక్క స్ప్రేతో మీ జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది!
Dandruff:చుండ్రు, జుట్టు రాలే సమస్యతో విసిగిపోయారా? ఈ ఒక్క స్ప్రేతో మీ జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది..ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య చుండ్రు (Dandruff), జుట్టు రాలిపోవడం. వాతావరణంలో మార్పులు, తలలో విపరీతమైన జిడ్డు, రసాయనాలతో నిండిన షాంపూలు వాడటం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి.
ఒక్కసారి చుండ్రు వచ్చిందంటే వదిలించుకోవడం చాలా కష్టం. అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. పైగా జుట్టు మూడు రెట్లు వేగంగా పెరిగేలా చేయొచ్చు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం – 3 స్పూన్లు
ఉల్లిపాయ – 1
వాము – 1 స్పూన్
కాఫీ పొడి – 1 స్పూన్
లవంగాల పొడి – 1 స్పూన్
వేప నూనె – 1 స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పులో మూడు స్పూన్ల బియ్యం తీసుకుని, అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక గిన్నెలో ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, వాము, కాఫీ పొడి, లవంగాల పొడి వేసి స్టవ్ మీద మరిగించాలి.ఈ నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించి.. ఆ తర్వాత వడగట్టి చల్లారనివ్వాలి.
నీరు పూర్తిగా చల్లారాక అందులో ఒక స్పూన్ వేప నూనె వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి.
ఎలా వాడాలి?
ఈ మ్యాజికల్ వాటర్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా స్ప్రే చేసుకోవాలి. సరిగ్గా అరగంట తర్వాత కుంకుడుకాయలతో (లేదా మైల్డ్ షాంపూతో) తలస్నానం చేయాలి.
ఎన్నిసార్లు వాడాలి?
మొదట్లో ఈ విధానాన్ని వారానికి రెండుసార్లు చేయాలి. చుండ్రు సమస్య తగ్గుముఖం పట్టాక, వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఉల్లిపాయ: ఇందులో ఉండే సల్ఫర్ చుండ్రును సమర్థవంతంగా నాశనం చేస్తుంది.
లవంగాలు: వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్లను, చుండ్రును తగ్గిస్తాయి.
బియ్యం నీళ్లు: జుట్టుకు పోషణను అందించి, జుట్టు రాలడాన్ని ఆపి, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
ఇంకెందుకు ఆలస్యం.. ఈ సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేసి మీ జుట్టును ఆరోగ్యంగా మార్చుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

