Aadhaar Card:ఆధార్ కార్డులో కొత్త రూల్స్: ఈ 2 వివరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోగలరు.. జాగ్రత్త!
Aadhaar Card:ఆధార్ కార్డులో కొత్త రూల్స్: ఈ 2 వివరాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోగలరు.. జాగ్రత్త.. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాల దగ్గరి నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వరకు ప్రతిదానికీ ఆధార్ తప్పనిసరి.
ఆధార్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకునే అవకాశాన్ని UIDAI కల్పిస్తోంది. అయితే, మీరు ఏ వివరాలు పడితే ఆ వివరాలను ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి ఇక కుదరదు. కొన్నింటిని మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకోగలరు! ఆ కఠిన నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎన్నిసార్లైనా మార్చుకునే వివరాలు:
మీ ఆధార్ కార్డులో ఉన్న ఈ క్రింది వివరాలను అవసరమైనప్పుడు తగిన డాక్యుమెంట్లు సమర్పించి మార్చుకునే అవకాశం ఉంది:
పేరు
ఇంటి చిరునామా (Address)
మొబైల్ నెంబర్
తండ్రి/భర్త పేరు
ఫోటో, బయోమెట్రిక్ (వేలిముద్రలు, కనుపాపలు)
జీవితంలో ‘ఒక్కసారి’ మాత్రమే మార్చుకునేవి:
కొందరు ప్రభుత్వ పథకాలు, పెన్షన్ల ద్వారా లబ్ధి పొందేందుకు తమ వయసును తప్పుగా చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు UIDAI గుర్తించింది. వీటికి చెక్ పెట్టేందుకే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
పుట్టిన తేదీ (Date of Birth): మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్లో కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోగలరు. కాబట్టి మార్పులు చేసేటప్పుడు సరైన డాక్యుమెంట్లు ఇస్తున్నారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ముఖ్యం.
లింగం (Gender): పుట్టిన తేదీతో పాటు జెండర్ (స్త్రీ/పురుష) వివరాలను కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది.
ఆధార్ సెంటర్కు వెళ్లకుండానే యాప్ ద్వారా..
గతంలో ఆధార్లో తప్పులు సరిదిద్దుకోవాలంటే మీ సేవ లేదా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కష్టం లేదు.
UIDAI అందుబాటులోకి తెచ్చిన ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మీరు ఇంటి నుంచే మీ డేట్ ఆఫ్ బర్త్ను అప్డేట్ చేసుకోవచ్చు.
దీనికోసం మీ టెన్త్ క్లాస్ మార్కుల మెమో (10th Certificate) లేదా బర్త్ సర్టిఫికెట్ (Date of Birth Certificate) వంటి సరైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
నిర్ణీత సర్వీస్ ఫీజు చెల్లించిన తర్వాత, అధికారులు మీ డాక్యుమెంట్లను పరిశీలించి ఆధార్లో వివరాలను అప్డేట్ చేస్తారు.
అందుకే ఆధార్లో వివరాలు నమోదు చేసేటప్పుడు లేదా మార్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

