Top Upi Credit Cards:ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఇచ్చే ఈ ‘టాప్ 4’ యూపీఐ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి!
Top Upi Credit Cards:ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఇచ్చే ఈ ‘టాప్ 4’ యూపీఐ క్రెడిట్ కార్డులపై ఓ లుక్కేయండి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ (UPI) పేమెంట్సే కనిపిస్తున్నాయి.
టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా స్కాన్ అండ్ పే! అయితే, ఇదే యూపీఐ పేమెంట్స్‌ను మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా.. క్రెడిట్ కార్డుతో చేస్తే? అవును, ఇప్పుడు యూపీఐ క్రెడిట్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. వీటి ద్వారా PhonePe, GPay, Paytm యాప్స్ నుంచి నేరుగా చెల్లింపులు చేయొచ్చు. పైగా అదిరిపోయే క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు కూడా వస్తాయి.
2026లో బెస్ట్ ఆఫర్లు, ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా అందుబాటులో ఉన్న టాప్-4 యూపీఐ క్రెడిట్ కార్డుల (BankBazaar డేటా ప్రకారం) వివరాలు మీకోసం:
1.కివి (Kiwi) క్రెడిట్ కార్డ్
హైలైట్: ఇది లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డ్! ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు.అన్ని యూపీఐ లావాదేవీలపై ఫ్లాట్ 1.5% క్యాష్‌బ్యాక్ వస్తుంది. కివి నియాన్ మెంబర్షిప్ ఉంటే మరింత ఎక్కువ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.క్యాష్‌బ్యాక్ నేరుగా యాప్ వాలెట్‌లోకి వస్తుంది, దాన్ని వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేసుకోవచ్చు.నియాన్ మెంబర్‌షిప్‌తో 3 ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ (Lounge Access) సౌకర్యం కూడా ఉంది.
2. HDFC బ్యాంక్ యూపీఐ రూపే (RuPay) క్రెడిట్ కార్డ్
కిరాణా, సూపర్‌మార్కెట్, డైనింగ్ మరియు PayZ యాప్ ద్వారా చేసే ఖర్చులపై 3% క్యాష్ పాయింట్స్ లభిస్తాయి. (నెలకు గరిష్టంగా 500 పాయింట్లు).
కరెంట్, వాటర్ వంటి యూటిలిటీ బిల్లుల చెల్లింపులపై 2% క్యాష్‌బ్యాక్ వస్తుంది.ఇతర యూపీఐ ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్ (రూ. 100 కంటే ఎక్కువ లావాదేవీలకు) వర్తిస్తుంది.
ఫీజు: జాయినింగ్ ఫీజు రూ. 99 మాత్రమే. కానీ, ఏడాదికి రూ. 25,000 ఖర్చు చేస్తే ఆ ఫీజు కూడా పూర్తిగా మాఫీ అవుతుంది.
3. IDFC ఫస్ట్ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ (HPCL) పవర్ ప్లస్ కార్డ్
యూపీఐ ద్వారా చేసే ప్రతి రూ. 150 రిటైల్ ఖర్చుపై 2 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రివార్డులకు ఎలాంటి లిమిట్ లేదు (Unlimited).వెల్కమ్ బెనిఫిట్స్ కింద సుమారు రూ. 2,250 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
ఫీజు: జాయినింగ్ మరియు రెన్యూవల్ ఫీజు రూ. 199. అయితే ఏడాదికి రూ. 50,000 ఖర్చు చేస్తే ఫీజు వెనక్కి వచ్చేస్తుంది.
4. యాక్సిస్ బ్యాంక్ సూపర్ మనీ (super.money) రూపే క్రెడిట్ కార్డ్
హైలైట్: జాయినింగ్ లేదా రెన్యూవల్ ఫీజులు అస్సలు లేవు!super.money యాప్ ద్వారా చేసే యూపీఐ చెల్లింపులపై ఏకంగా 3% రివార్డ్స్ లభిస్తాయి.పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ సర్‌చార్జ్ వేవర్ (1%) లభిస్తుంది, దీనివల్ల మీ పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయి.
యూపీఐ (UPI) అంటే?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీని ద్వారా మీ బ్యాంక్ ఖాతాలను లేదా రూపే క్రెడిట్ కార్డులను లింక్ చేసుకుని, క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేసి చాలా సులభంగా, సురక్షితంగా పేమెంట్లు చేయవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

