Face Care Tips:ఎండకు ముఖం నల్లగా మారిందా? పంచదార, నిమ్మకాయతో 5 నిమిషాల్లో ‘సన్ టాన్’ మాయం!
Face Care Tips:ఎండకు ముఖం నల్లగా మారిందా? పంచదార, నిమ్మకాయతో 5 నిమిషాల్లో ‘సన్ టాన్’ మాయం..వేసవి కాలం వచ్చేసింది.. ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు, ముఖంపై మురికి పేరుకుపోయి చర్మం నల్లగా (Sun Tan) మారిపోతుంది. దీనికి తోడు జిడ్డు కారుతూ ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. ఈ సన్ టాన్, జిడ్డును వదిలించుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా? అయితే ఇకపై ఆ అవసరం లేదు.
మన వంటింట్లో ఉండే మూడే మూడు వస్తువులతో.. కేవలం 5 నిమిషాల్లో ముఖంపై ఉన్న మురికిని, జిడ్డును తొలగించి ఇన్ స్టంట్ గ్లో (Instant Glow) సొంతం చేసుకోవచ్చు. ఆ మ్యాజిక్ ఫేస్ ప్యాక్ ఏంటి? దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
కాఫీ పొడి: 1 టేబుల్ స్పూన్
పంచదార: 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం: అర చెక్క
ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి?
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కాఫీ పొడి, పంచదార, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి (మెడ భాగంలో కూడా) అప్లై చేయాలి.వేళ్లతో ముఖంపై సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ (స్క్రబ్) చేయాలి.ఒక 10 నిమిషాల పాటు ప్యాక్ ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ ప్యాక్ ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తుంది?
పంచదార (Sugar): ఇది ఒక న్యాచురల్ స్క్రబ్. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను (Dead Cells), దుమ్ము, ధూళిని సులభంగా తొలగిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
కాఫీ పొడి (Coffee Powder): కాఫీలో ఉండే ‘కెఫిన్’ చర్మ కణాలను (Tissue) వేగంగా రిపేర్ చేస్తుంది. ముఖం మీద ముడతలు, మచ్చలను మాయం చేసి, చర్మానికి మంచి గ్లో, స్మూత్‌నెస్‌ను అందిస్తుంది.
నిమ్మరసం (Lemon Juice): నిమ్మరసంలోని విటమిన్-సి న్యాచురల్ బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇది సన్ టాన్‌ను వెంటనే కరిగించి, చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతుంది.
చిట్కా: ఎండలో నుంచి ఇంటికి రాగానే కాస్త సమయం కేటాయించి ఈ ప్యాక్ వేసుకుంటే.. జిడ్డు, సన్ టాన్ మాయమై మీ ముఖం పార్లర్‌కి వెళ్లినట్లుగా కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

