శ్రీరామ నవమి 2026: మార్చి 26నా 27నా? సరైన తేదీ ఇదే!
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. అయితే ఈ సంవత్సరం (2026) శ్రీరామ నవమి తేదీ విషయంలో భక్తుల్లో చాలా గందరగోళం నెలకొంది. కొన్ని క్యాలెండర్లలో మార్చి 26వ తేదీన పండుగ అని ఉంటే, మరికొన్నింటిలో మార్చి 27వ తేదీ అని ఉంది.
దీంతో అసలు పండుగ ఏ రోజున జరుపుకోవాలి? సీతారాముల కళ్యాణం ఏ రోజు జరుగుతుంది? అని చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్‌కు చెక్ పెడుతూ.. పండితులు, పంచాంగకర్తలు చెబుతున్న ఖచ్చితమైన వివరాలు మీకోసం!
నవమి తిథి ఎప్పుడు మొదలవుతుంది?
పంచాంగం ప్రకారం, చైత్ర శుద్ధ నవమి తిథి ఈ క్రింది సమయాల్లో ఉంది:
నవమి తిథి ప్రారంభం: 26 మార్చి 2026 (గురువారం), ఉదయం 11:48 గంటలకు.
నవమి తిథి ముగింపు: 27 మార్చి 2026 (శుక్రవారం), ఉదయం 10:06 గంటలకు.
తేదీల్లో గందరగోళానికి కారణం ఇదే!
నవమి తిథి రెండు రోజులు విస్తరించి ఉండటమే ఈ కన్ఫ్యూజన్‌కు ప్రధాన కారణం.మార్చి 26వ తేదీ ఉదయం నవమి తిథి ప్రారంభం కావడంతో, స్మార్త సాంప్రదాయం పాటించే వారు మార్చి 26నే పండుగగా భావిస్తున్నారు.
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి… పెళ్లి యోగం ఖాయం!!
అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం, సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో (ఉదయ తిథి) ఆ రోజంతా అదే తిథిగా పరిగణిస్తారు. మార్చి 27వ తేదీన సూర్యోదయ సమయానికి నవమి తిథి ఉండటం వల్ల, వైష్ణవ సాంప్రదాయం పాటించే వారు మార్చి 27న శ్రీరామ నవమి జరుపుకోవాలని చెబుతున్నారు.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఎప్పుడు?
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఏ రోజున పండుగ చేస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపుగా అదే రోజున పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీన (శుక్రవారం) వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.
ఫైనల్ గా పండుగ ఏ రోజున (Final Verdict):
సూర్యోదయ తిథి (ఉదయ తిథి) ప్రాముఖ్యత మరియు భద్రాచలం ఆలయ నిర్ణయం ప్రకారం.. శ్రీరామ నవమి పండుగను మార్చి 27, 2026 (శుక్రవారం) నాడు జరుపుకోవడమే శాస్త్ర సమ్మతం అని ఎక్కువ మంది పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ రోజునే పండుగ జరుపుకుని, శ్రీరామచంద్రుడి ఆశీస్సులు పొందండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

