LIC:ఎల్ఐసీ బంపరాఫర్: రోజుకు రూ.45 దాచుకుంటే చాలు.. చేతికి రూ.25 లక్షలు, జీవితకాలం ఫ్రీ ఇన్సూరెన్స్!
LIC:ఎల్ఐసీ బంపరాఫర్: రోజుకు రూ.45 దాచుకుంటే చాలు.. చేతికి రూ.25 లక్షలు, జీవితకాలం ఫ్రీ ఇన్సూరెన్స్..రిటైర్మెంట్ తర్వాత ఎవరి ముందు చెయ్యి చాపకుండా, ఆర్థికంగా స్థిరమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
అలాంటి వారి కోసమే భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ఒక అద్భుతమైన స్కీమ్‌ను తీసుకువచ్చింది. రోజుకు కేవలం ఒక టీ తాగే ఖర్చును పక్కన పెడితే చాలు.. భవిష్యత్తులో మీరు లక్షాధికారి కావొచ్చు. ఆ సూపర్ హిట్ పాలసీ పేరే ‘ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ – ప్లాన్ 915’ (LIC New Jeevan Anand – Plan 915).
రోజుకు రూ. 45 తో రూ. 25 లక్షలు ఎలా వస్తాయి?
ఈ స్కీమ్‌లో మీరు పెద్దపెద్ద మొత్తాలు కట్టాల్సిన పన్లేదు. ఉదాహరణకు మీ వయసు 35 ఏళ్లు అనుకుందాం. మీరు 35 ఏళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్‌తో రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ (హామీ మొత్తం) పాలసీ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుంది:
ఏడాదికి కట్టాల్సిన ప్రీమియం: సుమారు రూ. 16,300
నెలకు కట్టేది: రూ. 1,359
అంటే రోజుకు మీరు పొదుపు చేసేది: కేవలం రూ. 45 మాత్రమే!
ఈ లెక్కన 35 ఏళ్లలో మీరు కట్టే మొత్తం సుమారు రూ. 5.70 లక్షలు అవుతుంది. కానీ, మెచ్యూరిటీ సమయానికి LIC ప్రకటించే బోనస్‌లు, ఫైనల్ అడిషన్ బోనస్‌లు అన్నీ కలిపి మీకు ఏకంగా రూ. 25 లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి దాదాపు 5 రెట్లు లాభం అన్నమాట.
ఈ పాలసీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇదే!
సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా మెచ్యూరిటీ డబ్బులు వచ్చాక క్లోజ్ అయిపోతుంది. కానీ ‘న్యూ జీవన్ ఆనంద్’ స్పెషాలిటీ వేరు!
మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 25 లక్షలు చేతికి వచ్చేసినా.. మీరు మొదట ఎంచుకున్న రూ. 5 లక్షల రిస్క్ కవర్ (జీవిత బీమా) జీవితాంతం ఉచితంగా కొనసాగుతుంది.
దీనికోసం మీరు మెచ్యూరిటీ తర్వాత ఒక్క రూపాయి కూడా అదనంగా కట్టనవసరం లేదు. భవిష్యత్తులో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా, వారి కుటుంబానికి ఆ రూ. 5 లక్షల బీమా సొమ్ము అదనంగా అందుతుంది. అంటే జీవించి ఉన్నప్పుడు చేతికి డబ్బు, ఆ తర్వాత కుటుంబానికి భరోసా.
ఇతర అదనపు బెనిఫిట్స్
పన్ను ఆదా: మీరు కట్టే ప్రీమియంపై (సెక్షన్ 80C కింద), మీకు వచ్చే మెచ్యూరిటీ డబ్బుపై (సెక్షన్ 10(10D) కింద) పూర్తిగా టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.
లోన్ సదుపాయం: డబ్బులు అత్యవసరమైతే.. పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత తక్కువ వడ్డీకే దీనిపై లోన్ కూడా తీసుకోవచ్చు.
గ్రేస్ పీరియడ్: ఒకవేళ ప్రీమియం కట్టడం లేట్ అయినా, ఎలాంటి పెనాల్టీ పడకుండా 30 రోజుల వరకు ఎల్ఐసీ అదనపు సమయం (Grace Period) ఇస్తుంది.
తక్కువ పెట్టుబడితో రిటైర్మెంట్ లైఫ్‌ను సెక్యూర్ చేసుకోవాలనుకునే మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ ఒక బెస్ట్ ఆప్షన్ అని కచ్చితంగా చెప్పవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

